హెల్త్ పాలసీ హోల్డర్లకు ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐసీఐసీఐ లాంబార్డ్(ICICI Lombard) గుడ్ న్యూస్ చెప్పింది. ‘ఎనీవేర్ క్యాష్‌లెస్’(Anywhere Cashless) ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్‌తో ఆసుపత్రుల్లో ఫీజు చెల్లించకుండా ఆసుపత్రిలో అడ్మిట్ కావచ్చు. దీంతో పాటు మిగతా సేవలకు క్యాష్‌లెస్ ఫెసిలిటీని ఉపయోగించుకునేందుకు వీలు కలగనుంది.
ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నప్పటికీ చాలామంది పాలసీదారులు తొలుత ఆసుపత్రుల్లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఇన్సూరెన్స్‌ని క్లెయిమ్ చేసుకునే వీలు ఉంటుంది. పాలసీదారులకు ఇది ప్రధాన సమస్య. దీనికి పరిష్కారంగా ఐసీఐసీఐ లాంబార్డ్ క్యాష్‌లెస్ ఫీచర్‌ని తీసుకొచ్చింది. దీంతో పాలసీదారు జేబు నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు. కంపెనీనే సదరు హాస్పిటల్‌కి పాలసీదారు తరఫున బిల్లు కడుతుంది.
క్యాష్‌లెస్ ఫీచర్ సేవలు పొందడానికి ఐసీఐసీఐ లాంబార్డ్ కొన్ని షరతులు విధించింది. సదరు హాస్పిటల్లో క్యాష్‌లెస్ సౌకర్యం తప్పనిసరిగా ఉంటేనే ఈ ఫీచర్ వర్తిస్తుంది. క్యాష్‌లెస్ సదుపాయం లేని ఆసుపత్రిలో చేరితే ఈ ఫీచర్ వర్తంచబోదు. అదే విధంగా ఈ ఫీచర్‌తో లబ్ధి పొందాలంటే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే సమయానికి కనీసం 24 గంటల ముందు పాలసీదారు కంపెనీకి తెలియజేయాలి. ‘ఐఎల్ టేక్కేర్’(IL takecare) యాప్ ద్వారా ఈ ఫీచర్‌ని ఉపయోగించుకోవచ్చని ఇన్సూరెన్స్ కంపెనీ తెలిపింది.
* తొలి కంపెనీ : ఇన్సూరెన్స్ కవరేజీని విస్తరించడమే ఈ ‘ఎనీవేర్ క్యాష్‌లెస్’ ఫీచర్ ముఖ్య ఉద్దేశమని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలోక్ అగర్వాల్ స్పష్టం చేశారు. మరిన్ని ఆసుపత్రులతో జతకట్టి చిన్న పట్టణాలు, నగరాలకు ఇన్సూరెన్స్ సేవలను వ్యాప్తి చేయడమే లక్ష్యమని అలోక్ అగర్వాల్ చెప్పారు. క్యాష్‌లెస్ ఫీచర్‌తో ఆసుపత్రిలో చేరిన అనంతరం పాలసీ దారు నిశ్చితంగా ఉండొచ్చని తెలిపారు. ఈ ఫీచర్‌ని తీసుకొచ్చిన తొలి ఇన్సూరెన్స్ కంపెనీ తమదేనని ఆయన పేర్కొన్నారు.
* 2.93 కోట్ల పాలసీలు : ఔట్ పేషంట్ మెడికల్ అవసరాల కోసం గతంలో ‘ఐసీఐసీఐ లాంబార్డ్’ క్యాష్‌లెస్ ఫీచర్‌ని తీసుకొచ్చింది. కోవిడ్ ప్రబలతున్న సమయంలో నగదు రహిత చెల్లింపుల కోసం ‘మెడ్పే సీసీఎన్’ యాప్‌తో జతకట్టింది. ఈ యాప్ ద్వారా క్లెయిమ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. అయితే, ఇప్పటివరకు 2.93 కోట్ల పాలసీలను ఐసీఐసీఐ లాంబార్డ్ ఇష్యూ చేసింది. ఇందులో 23లక్షల క్లెయిమ్స్ సెటిల్ చేసింది. ప్రీమియంల ద్వారా మార్చి 2022 నాటికి రూ.18,562 కోట్లను ఆర్జించింది.