బ్యాంకులు రుణ రేట్ల పెంచడం వల్ల ఎంసీఎల్ఆర్ ఆధారంగా లోన్ తీసుకున్న వారి ఈఎంఐలు పెరుగుతాయి. లోన్ రీసెట్ డేట్ నుంచి పెంపు వర్తిస్తుంది. ఇకపోతే కొత్తగా లోన్ తీసుకోవాలంటే పెరిగిన వడ్డీ రేట్ల ప్రకారమే రుణం మంజూరు అవుతుంది. అంటే బాదుడు భరించాల్సిందే. ఇతర బ్యాంకులు కూడా రానున్న కాలంలో రుణ రేట్లు పెంచే అవకాశం ఉంది. దీంతో బ్యాంక్ కస్టమర్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. అన్ని బ్యాంకుల్లోనే లోన్ రేట్లు పెరుగుతాయి.