ఐసీఐసీఐ బ్యాంక్ 7 రోజుల నుంచి ఏడాదిలోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.75 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. ఏడాది నుంచి 15 నెలల ఎఫ్డీలపై అయితే వడ్డీ రేటు 6.1 శాతం నుంచి 6.6 శాతానికి చేరింది. 15 నెలల నుంచి రెండేళ్ల ఎఫ్డీలపై వడ్డీ రేటు 7 శాతానికి చేరింది. రెండేళ్ల నుంచి 3 ఏళ్ల ఎఫ్డీలపై కూడా ఇదే వడ్డీ రేటు ఉంది.
మూడేళ్ల నుంచి ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లకు కూడా ఇదే వడ్డీ రేటు వర్తిస్తుంది. ఇక ఐదేళ్ల నుంచి పదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై అయితే 6.9 శాతం వడ్డీ వస్తుంది. ఇంకా ఐదేళ్ల ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలపై కూడా వడ్డీ రేటు 6.6 శాతం నుంచి 7 శాతానికి చేరింది. ఇంకా బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీలపై 0.5 శాతం అదనపు వడ్డీకి అదనంగా 0.1 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.