ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోటీగా ప్రైవేటు బ్యాంకులు సైతం ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ. 2 కోట్లకు పైబడిన బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో ఐసీఐసీఐ బ్యాంకు సైతం ఎఫ్డీ వడ్డీ రేట్లను పెంచుతూ కస్టమర్లకు గుడ్న్యూస్ చెప్పింది. పెరిగిన వడ్డీ రేట్లు ఈ ఏడాది మార్చి 10 నుంచి అమలులోకి వస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే, ఈ వడ్డీ రేట్లు రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఉన్న బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై మాత్రమే వర్తించనుంది. ఈ రేట్లు దేశీయ కస్టమర్లతో పాటు ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఐ, ఎన్ఆర్ఈ కస్టమర్లకు కూడా వర్తిస్తాయి. అయితే, రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు ఉండదు. ఐసీఐసీఐ బ్యాంక్లో రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఉన్న బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వివిధ కాల వ్యవధిలో వడ్డీ రేట్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ రేట్లు దేశీయ ఖాతాదారులు, ఎన్ఆర్వో, ఎన్ఆర్ఈ కస్టమర్లకు వర్తించనున్నాయి. కాగా, ICICI బ్యాంక్ ప్రత్యర్థి ఎస్బీఐ ఇటీవల రూ. 2 కోట్ల కంటే ఎక్కువ బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 20- నుంచి 40 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐసీఐసీఐ బ్యాంకు సైతం ఎఫ్డీ వడ్డీ రేట్లను సవరించింది. (ప్రతీకాత్మక చిత్రం)