ICICI FD Rates: ఐసీఐసీఐ బ్యాంక్ కీలక నిర్ణయం.. ఈరోజు నుంచే అమలులోకి, కస్టమర్లకు కలిగే బెనిఫిట్ ఇదే!
ICICI FD Rates: ఐసీఐసీఐ బ్యాంక్ కీలక నిర్ణయం.. ఈరోజు నుంచే అమలులోకి, కస్టమర్లకు కలిగే బెనిఫిట్ ఇదే!
ICICI Bank FD Rates | మీరు బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని చూస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా ఎఫ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Bank FD Rates | ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా తీపికబురు అందించింది. దేశీ దిగ్గజ బ్యాంకులైన ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దారిలోనే నడిచింది. డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలిగే ప్రకటన చేసింది.
2/ 9
బ్యాంక్ మరోసారి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేసింది. బ్యాంక్ ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంచడం ఈ నెలలో ఇది వరుసగా రెండో సారి కావడం గమనార్హం. దీంతో డిపాజిట్ దారులకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.
3/ 9
ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేర పెంచేసింది. వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం నేటి నుంచే అమలులోకి వస్తుంది. రూ. 2 కోట్లకు లోపు డిపాజిట్లకు వడ్డీ రేట్ల పెంపు వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది.
4/ 9
ఐసీఐసీఐ బ్యాంక్ అక్టోబర్ 18న కూడా ఎఫ్డీ రేట్లు పెంచింది. అప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్లు మేర పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్ రేట్ల పెంపు తర్వాత ఎఫ్డీ రేట్లను గమనిస్తే.. 46 రోజుల నుంచి 60 రోజుల ఎఫ్డీలపై వడ్డీ రేటు 3.5 శాతం నుంచి 3.75 శాతానికి చేరింది.
5/ 9
61 రోజుల నుంచి 90 రోజుల ఎఫ్డీలపై వడ్డీ 4 శాతంగా ఉంది. ఇది వరకు ఈ వడ్డీ రేటు 3.75 శాతంగా ఉండేది. 91 రోజుల నుంచి 184 రోజుల కాల పరిమితిలోని ఎఫ్డీలపై వడ్డీ రేటు 4.25 శాతం నుంచి 4.5 శాతానికి చేరింది.
6/ 9
185 రోజుల నుంచి 289 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.25 శాతానికి చేరింది. ఇది వరకు వడ్డీ రేటు 5 శాతంగా ఉంది. అలాగే 290 రోజుల నుంచి ఏడాది ఎఫ్డీలపై వడ్డీ రేటు 5 శాతం నుంచి 5.5 శాతానికి పెరిగింది. అంటే వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్లు పైకి కదిలింది.
7/ 9
ఏడాది నుంచి 18 నెలల ఎఫ్డీలపై వడ్డీ రేటు 6.1 శాతానికి చేరింది. అలాగే 18 నెలల నుంచి రెండేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.8 శాతం నుంచి 6.15 శాతానికి పెరిగింది. రెండేళ్ల నుంచి మూడేళ్ల ఎఫ్డీలపై అయితే వడ్డీ రేటు 6.2 శాతానికి చేరింది. ఇదివరకు ఇది 6 శాతంగా ఉంది.
8/ 9
మూడేళ్ల ఒక రోజు నుంచి ఐదేళ్ల ఎఫ్డీలపై వడ్డీ రేటు 6.2 శాతం నుంచి 6.35 శాతానికి ఎగసింది. ఇక ఐదేళ్ల నుంచి పదేళ్ల కాల పరిమితిలోని ఎఫ్డీలపై వడ్డీ రేటు 6.25 శాతానికి పెరిగింది. ఇది వరకు ఈ వడ్డీ రేటు 6.1 శాతంగా ఉంది. ఐదేళ్ల ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీపై అయితే 6.35 శాతం వడ్డీ పొందొచ్చు.
9/ 9
ఇకపోతే సీనియర్ సిటిజన్స్‌కు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. రెగ్యులర్ కస్టమర్లతో పోలిస్తే.. వీరికి 50 బేసిస్ పాయింట్ల ఎక్కువ వడ్డీ వస్తుంది. వారికి 3.5 శాతం నుంచి 6.95 శాతం వరకు వడ్డీ లభిస్తుంది.