దీనికి సంబంధించిన మెసేజ్‌లను ఇప్పటికే వినియోగదారులకు పంపించడం ప్రారంభించింది. ఫిబ్రవరి 10 నుంచి క్రెడిట్ కార్డు వినియోగించి ఏటీఎం కేంద్రాల వద్ద నగదు తీసినా, ఆలస్యంగా బిల్లులు చెల్లించినా వినియోగదారులపై భారీగా భారం పడనుంది. మరోవైపు, క్యాష్ అడ్వాన్స్ ట్రాన్సాక్షన్లపై మీద కూడా బ్యాంకు ఛార్జీలు వసూలు చేస్తుంది. చెక్ రిటర్న్స్, ఆటో డెబిట్ ఫెయిల్యూర్లపై బిల్లు మొత్తంలో 2 శాతం లేదా కనీసం రూ.500 ఛార్జీ వసూలు చేస్తుంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎస్బీఐ కార్డ్, యాక్సిస్ బ్యాంక్‌లు రూ. 50,000 కంటే ఎక్కువ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్‌పై వరుసగా రూ. 1300, రూ. 1300, రూ. 1000 ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకులు అమలు చేస్తున్న క్రెడిట్ కార్డు లేట్ పేమెంట్ ఛార్జీలను పరిశీలిద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఛార్జీలు
రూ. 500 కంటే తక్కువ బ్యాలెన్స్‌పై ఎటువంటి లేట్ పేమెంట్ ఛార్జీ ఉండదు. రూ. 501-1000 వరకు గల బ్యాలెన్స్‌పై రూ. 400, రూ. 1,001 నుంచి రూ.10,000 గల బ్యాలెన్స్‌పై రూ. 1300 లేట్ పేమెంట్ ఛార్జీ చెల్లించాలి. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లపై 2.5 చొప్పున క్యాష్ అడ్వాన్స్ ఛార్జీలు వసూలు చేస్తుంది. ఇక, క్రెడిట్ లిమిట్‌కు మించి వాడుకుంటే.. ఓవర్ లిమిట్ ఛార్జీ 2.5 శాతం లేదా గరిష్టంగా రూ. 600 వసూలు చేస్తుంది. మరోవైపు, కనిష్టంగా 2 శాతం లేదా రూ. 500 ఆటో డెబిట్ ఫీజు వసూలు చేస్తుంది.
హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ ఛార్జీలు
రూ.100లోపు బిల్లులపై ఎలాంటి ఛార్జీ ఉండదు. రూ.100 నుంచి 500 బిల్లుపై రూ.100 ఆలస్య చెల్లింపు చార్జీ ఉంటుంది. రూ.501 -5,000 వరకు బిల్లులపై రూ.500, రూ.5001- 10000 వరకు రూ.600, రూ.10001- 25000 బిల్లులపై రూ.800, రూ.25,001-50,000పై ఆలస్య రుసుము కింద రూ.1100 చెల్లించాలి. మీరు విత్‌డ్రా చేసిన నగదు మొత్తంపై 2.5 శాతం లేదా రూ. 500, ఏది ఎక్కువైతే అది క్యాష్ అడ్వాన్స్ ఛార్జీ చెల్లించాలి.
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఛార్జ్
రూ.300లోపు బిల్లులపై ఎలాంటి ఛార్జీ ఉండదు. రూ.300-500 బిల్లుపై రూ.100 లేట్ పేమెంట్ చార్జీ ఉంటుంది. రూ.501- 1000 వరకు బిల్లులపై రూ.500, రూ.1001- 10000 వరకు రూ. 1000 ఆలస్య రుసుము చెల్లించాలి. క్యాష్ అడ్వాన్స్ తీసుకుంటే మొత్త అమౌంట్‌పై రూ.500 లేదా 2.5 శాతం ఛార్జీ విధిస్తారు. ఆటో డెబిట్ లేదా చెక్ రిటర్న్‌లపై కనీసం 2 శాతం లేదా రూ. 450 ఫీజు వసూలు చేస్తారు. గరిష్టంగా రూ. 1,500 వసూలు చేస్తుంది.
క్రెడిట్ కార్డ్ బిల్లును సకాలంలో చెల్లించకుంటే ఏమవుతుంది?
క్రెడిట్ కార్డు ఛార్జీలను సకాలంలో చెల్లించకపోతే బ్యాంకులు పెనాల్టీతో పాటు బ్యాలెన్స్ అమౌంట్‌పై వడ్డీ విధిస్తాయి. మరోవైపు, తర్వాతి నెలలో జరిపే ట్రాన్సాక్షన్లపై వడ్డీ రహిత ఫైనాన్సింగ్ అందుబాటులో లేదు. సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. తద్వారా భవిష్యత్తులో బ్యాంకు లోన్లు పొందే అవకాశాలు సన్నగిల్లుతాయి.