క్రెడిట్ కార్డ్స్‌కు (Credit Cards) సంబంధించి వేర్వేరు సేవల ఛార్జీలను పెంచనున్నట్లు తెలిపింది ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ICICI. ఈ విషయంపై కస్టమర్లకు శనివారం మెసేజ్‌లు పంపించింది. ఇందులో లేట్ పేమేంట్ ఫీజు కూడా ఉంది. ఫిబ్రవరి 10, 2022 నుంచి ఫీజుల మొత్తం మారనున్నట్టు ఈ మెపేజ్ ద్వారా తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
ఇంతకీ క్యాష్ అడ్వాన్స్ అంటే ఏంటి?
క్యాష్ అడ్వాన్స్ అంటే క్రెడిట్ కార్డు ఉపయోగించి క్యాష్ విత్‌డ్రా చేసుకునే సదుపాయం. కొనుగోళ్ల తరహాలో కాకుండా, క్యాష్ విత్‌డ్రాపై డబ్బు తీసినప్పటి నుంచే బ్యాంకులు వడ్డీ విధిస్తాయి. అంతర్జాతీయ ప్రయాణాలు, ఫారిన్ ఎక్స్ఛేంజ్ క్యాష్ విత్‌డ్రాలపై అదనపు ట్రాన్సక్షన్ ఫీజు కూడా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
లేట్ పేమెంట్ ఫీజు పెంపు
ICICI Bank Emerald Credit Card మినహా మిగిలిన అన్ని కార్డులపై లేట్ పేమెంట్ ఛార్జీలను బ్యాంక్ సవరించింది. చెల్లించాల్సిన మొత్తాన్ని బట్టి ఈ లేట్ పేమెంట్ ఛార్జీ మారుతూ ఉంటుంది. చెల్లించాల్సిన మొత్తం రూ.100 కంటే తక్కువ ఉంటే బ్యాంకు ఎటువంటి రుసుము వసూలు చేయదు. చెల్లించాల్సిన మొత్తం పెద్ద మొత్తంలో ఉంటే ఈ రుసుము పెరుగుతూ ఉంటుంది. రూ.50,000 పైబడిన మొత్తానికి బ్యాంకు వసూలు చేసే అత్యధిక మొత్తం రూ.1200.(ప్రతీకాత్మక చిత్రం)
తుది గడువులోపు పేమెంట్ చేయకపోతే ఏం చేయవచ్చు?
తుది గడువులోపు క్రెడిట్ కార్డు బిల్లు బకాయి మొత్తాన్ని చెల్లించడం సాధ్యం కానప్పుడు మీ వడ్డీ మొత్తం పెరగకుండా చూసేందుకు క్రెడిట్ కార్డును ఉపయోగించకపోవడం మంచిది. బిల్లు చెల్లించకుండా మీరు క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే మీ క్రెడిట్ ఫ్రీ వ్యవధిని మీరు కోల్పోతారు. చెల్లింపులు జరపడం మీకు కష్టంగా మారితే పెద్ద మొత్తంలో ఉన్న లావాదేవీలను EMIల్లోకి (సమానమైన నెలవారీ వాయిదాలు) మార్చుకోవడం మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)
దీని వల్ల చెల్లింపులు జరిపేందుకు మీకు కొంత వెసులుబాటు లభిస్తుంది. బకాయి పడిన మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం మీకు సాధ్యం కాకపోయినా, లేదా లావాదేవీలను EMIలుగా మార్చుకోవడం కుదరకపోయినా.. మీరు మరో రుణదాత నుంచి పర్సనల్ లోన్ తీసుకొని క్రెడిట్ కార్డుపై ఉన్న బకాయి మొత్తాన్ని ఒకే దఫాలో చెల్లించడం మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)