ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం చూస్తే.. కొత్తగా బ్యాంక్‌లో ఓపెన్ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లకు మాత్రమే ఈ అదనపు వడ్డీ బెనిఫిట్ ఉంటుంది. అలాగే రెన్యూవల్ చేసుకునే ఫిక్స్డ్ డిపాజిట్లకు కూడా కొత్త రేట్లు వర్తిస్తాయి. గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ స్కీమ్‌లో చేరాలని భావించే వారు ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు.
ఇకపోతే ఐసీఐసీఐ బ్యాంక్ 60 ఏళ్లకు పైన వయసు కలిగిన సీనియర్ సిటిజన్స్‌కు 6.6 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. అలాగే 60 ఏళ్లకు లోపు వయసు కలిగిన కస్టమర్లకు 6.1 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు మారవు. చేరేటప్పుడు ఏ వడ్డీ రేటు ఉందో.. మెచ్యూరిటీ సమయంలో కూడా అదే వడ్డీ రేటు వర్తిస్తుంది.