IT Jobs | ఐటీ ఉద్యోగులకు కంపెనీలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఒకే సారి రెండు కంపెనీల్లో ఉద్యోగాలు చేయడం సరి కాదని పేర్కొంటున్నాయి. ఇలాంటి వారు చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి. జాబ్‌లో (Jobs) నుంచి నిర్దాక్షిణ్యంగా తీసేస్తామని వార్నింగ్ ఇస్తున్నాయి. దీంతో ఇప్పుడు అందరూ మూన్‌లైటింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు.