1. కరోనా అనంతరం కూడా ఆటో మొబైల్ రంగం ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ఇన్పుట్ కాస్ట్ పెరగడంతో చాలా కంపెనీలు కార్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. త్వరలో RDE నిబంధనలు అమల్లోకి రానుండటంతో.. కంపెనీలు కొన్ని వేరియంట్లను నిలిపివేస్తున్నాయి. నిబంధనలకు అనుగుణంగా వాహనాలను మాడిఫై చేయడానికి పెద్ద మొత్తంలో ఖర్చవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇప్పుడు తాజాగా హ్యుందాయ్ ఈ జాబితాలో చేరింది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ ఆటోమొబైల్ కంపెనీ లాంచ్ చేసిన చాలా కార్లు, SUVలు పాపులర్ అయ్యాయి. ఈ కంపెనీ హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి సెడాన్లు, SUVల వరకు అనేక సెగ్మెంట్లలో ప్రొడక్టులను లాంచ్ చేసింది. అయితే దక్షిణ కొరియాకు చెందిన ఈ ఆటోమేకర్.. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో i20, వెర్నా, క్రెటా వంటి కొన్ని వేరియంట్లను నిలిపివేయాలని నిర్ణయించుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. హ్యుందాయ్ ఇండియా భారతదేశంలో మొత్తం 11 కార్లను దశలవారీగా తమ ప్రొడక్షన్స్ లైనప్ నుంచి తొలగించాలని భావిస్తోంది. రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ (RDE) త్వరలో అమలులోకి రాబోతున్నందున చాలా వేరియంట్లను మార్కెట్‌కు దూరం చేయనుంది. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కస్టమర్ ప్రాధాన్యతలు కూడా లేకపోలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
4. RDE నిబంధనలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ఇన్పుట్ ఖర్చులు, ధరల పెరుగుదల మధ్య సమతుల్యతను సాధించడానికి వాహన తయారీదారులు ఇప్పటికే పోరాడుతున్నాయి. కొన్ని రకాల కార్ల ధరలను పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నాయి. దీంతో తక్కువ జనాదరణ పొందిన మోడల్స్, వేరియంట్ల ఉత్పత్తిని నిలిపివేయడం మంచిదని కంపెనీలు భావిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. హ్యుందాయ్ i20 లైనప్‌ను నాలుగు వేరియంట్లకు తగ్గిస్తోంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ i20 స్పోర్ట్స్ మోడల్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. Asta(O) MT, Magna MT, స్పోర్ట్స్ MT సహా ఇతర డీజిల్-బేస్డ్ మోడల్స్‌ను తొలగించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. మరోవైపు హ్యుందాయ్ వెర్నా, సెడాన్ సెగ్మెంట్లలో ఐదు కార్లను కోల్పోయే అవకాశం ఉంది. క్రెటా మోడల్ హ్యుందాయ్ కంపెనీ తరఫున అత్యధికంగా అమ్ముడైన వాహనం. కాబట్టి దీని విషయంలో కంపెనీ కొంత ఆచితూచి నిర్ణయం తీసుకుంది. క్రెటా SUV రెండు వేరియంట్లను మాత్రమే హ్యుందాయ్ అధికారికంగా ఉపసంహరించుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. హ్యుందాయ్ EV సెగ్మెంట్‌ను పరిశీలిస్తే.. త్వరలో క్రెటా EV లాంచ్ చేసే ప్రణాళికలో ఉంది. హ్యుందాయ్ చెన్నై ప్రొడక్షన్ సైట్లో దీని ప్రొడక్షన్‌కు సంబంధించిన కార్యకలాపాలు జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ విస్తరణకు హ్యుందాయ్ క్రెటా EV తీసుకొస్తోంది. ICE ప్లాట్‌ఫారమ్ మాడిఫైడ్ వెర్షన్లో దీన్ని రూపొందిస్తోంది. ఇది E-GMP ప్లాట్‌ఫారమ్ పూర్తి స్థానికీకరణ ప్రారంభాన్ని సూచిస్తుంది. రాబోయే అన్ని హ్యుందాయ్ ఎలక్ట్రిక్ వాహనాలకు సపోర్ట్ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)