1. కొత్త కార్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. దీపావళి ఫెస్టివల్ సీజన్లో కార్ కొంటే ఏకంగా లక్ష రూపాయల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. హ్యుందాయ్ మోటార్ కంపెనీ దీపావళి ఆఫర్స్ ప్రకటించింది. హ్యుందాయ్ ఆరా, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, హ్యుందాయ్ ఐ20, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ మోడల్స్‌పై రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. హ్యుందాయ్ కార్లపై క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కలిపి రూ.1 లక్ష వరకు ప్రయోజనాలు పొందొచ్చు. దేశంలోని హ్యుందాయ్ ఆథరైజ్డ్ డీలర్ల దగ్గర ఈ ఆఫర్స్ లభిస్తాయి. హ్యుందాయ్ ప్రకటించిన దీపావళి ఆఫర్స్‌ని 2022 అక్టోబర్ 31 వరకు పొందొచ్చు. అంటే దీపావళి తర్వాత కూడా ఈ ఆఫర్స్ మరో 6 రోజులు లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. హ్యుందాయ్ ఆరా హ్యాచ్‌బ్యాక్ అన్ని వేరియంట్లపై ఆఫర్స్ ఉన్నాయి. హ్యుందాయ్ ఆరా కార్‌పై రూ.33,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ద్వారా కొనేవారికి రూ.10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్ ఉద్యోగులకు అదనంగా రూ.3,000 ప్రయోజనాలు లభిస్తాయి. హ్యుందాయ్ ఆరా ప్రారంభ ధర రూ.6,08,900. ఇది ఎక్స్-షోరూమ్ ధర. (ప్రతీకాత్మక చిత్రం)
4. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్ కొంటే రూ.48,000 వరకు ప్రయోజనాలు పొందొచ్చు. రూ.35,000 వరకు క్యాష్ ఆఫర్స్, రూ.10,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్ ఉద్యోగులకు అదనంగా రూ.3,000 ప్రయోజనాలు లభిస్తాయి. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్ 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ప్రారంభ ధర రూ.5,43,000. ఇది ఎక్స్-షోరూమ్ ధర. (ప్రతీకాత్మక చిత్రం)
5. హ్యుందాయ్ ఐ20 కార్ కొనేవారికి రూ.20,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. రూ.10,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్ హ్యాచ్‌బ్యాక్ కార్లపై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. హ్యుందాయ్ ఐ20 ప్రారంభ ధర రూ.7,07,000. ఇది ఎక్స్-షోరూమ్ ధర. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారుపై ఎక్కువ డిస్కౌంట్ లభిస్తుండటం విశేషం. ఏకంగా రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇది కేవలం క్యాష్ ఆఫర్ మాత్రమే. ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్స్ లాంటివి ఏమీ ఉండవు. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ.24,02,800. ఇది ఎక్స్-షోరూమ్ ధర. (ప్రతీకాత్మక చిత్రం)