కొరియన్ ఆటోమేకర్ హ్యుందాయ్ పోర్టిఫోలియోలోని చాలా మోడల్స్ టాప్ సేల్స్‌ను సొంతం చేసుకున్నాయి. క్రెటా, వెన్యూ, గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20 వంటి మోడల్స్ పాపులర్ అయ్యాయి. హ్యుందాయ్ ఇప్పుడు వినియోగదారులకు మరింత దగ్గరయ్యేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇటీవలే వివిధ మోడల్స్ పై డిస్కౌంట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
డిస్కౌంట్ సర్వీసెస్ వివరాలు
ప్రీ-సమ్మర్ క్యాంప్ మార్చి 17 నుంచి 30 వరకు జరగనుంది. ఈ సమయంలో వివిధ సర్వీస్‌లపై తన కస్టమర్లకు కంపెనీ డిస్కౌంట్స్ అందిస్తోంది. ప్రధానంగా లేబర్ ఛార్జీలు, ACకి సంబంధించిన వర్క్, ఎక్స్టీరియర్, ఇంటీరియర్ బ్యూటిఫికేషన్ వంటి సర్వీసెస్‌ను హ్యుందాయ్ డిస్కౌంట్స్‌కు అందించనుంది.
ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే.. హ్యుండాయ్ వెర్నా 2023లో పూర్తి రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్ ఉండనుంది. మరింత స్పోర్టీవ్ లుక్‌లో కనిపించేలా దీన్ని డిజైన్ చేశారు. ఫ్రంట్‌లో సన్నని ఎల్ఈడీ లైట్ బార్ ఉంటుంది. వెనుక ఎల్-షేప్డ్ ఎల్ఈడీ టైల్లైట్స్ ఉంటాయి. బంపర్ డిజైన్‌లో కూడా మార్పులు చేశారు. ఇంటీరియర్ డిజైన్‌గా భారీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో కూడిన డ్యుయల్ స్క్రీన్ సెటప్ ఇందులో ఉండనుంది. ఇందులోనే మరొకటి డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్‌గా ఉంటుంది.
రెండు ఇంజన్లతో వస్తుంది
హ్యుందాయ్ వెర్నా-2023లో 30 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్, హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ 17 లెవల్ 2 ADAS ఫీచర్స్ ఉన్నాయి. టాప్-స్పెక్ వేరియంట్లో 65 కంటే ఎక్కువ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు రెండు ఇంజన్ ఆప్షన్స్‌తో రానుంది. 1.5 లీటర్ ఇంజన్‌తో కూడిన కారు115 పిఎస్ పవర్ & 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండో ఇంజిన్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్, ఇది 160 పిఎస్ పవర్ & 265 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.