Hyundai Offer: కొత్తగా కారు కొనే వారికి బంపరాఫర్.. ఏకంగా రూ.లక్షా 50 వేల డిస్కౌంట్!
Hyundai Offer: కొత్తగా కారు కొనే వారికి బంపరాఫర్.. ఏకంగా రూ.లక్షా 50 వేల డిస్కౌంట్!
Car Discount | కొత్త కారు కొనే వారికి బంపరాఫర్. భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఏకంగా 1.5 లక్షల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఏ ఏ మోడల్‌పై ఎంత తగ్గింపు ఉందో తెలుసుకోండి.
Car Offers | కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నయి. కారు కొంటే ఏకంగా రూ. 1.5 లక్షల దాకా డిస్కౌంట్ లభిస్తోంది. అందుకే కారు కొనే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు.
2/ 10
ప్రముఖ కార్ల తయారీ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న హ్యుందాయ్ మోటార్స్ ఇండియా తన మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తోంది. ఫిబ్రవరి నెల వరకే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని చెప్పుకోవచ్చు.
3/ 10
ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌పై క్యాష్ డిస్కౌంట్ రూ. 10 వేల వరకు ఉంది. ఎక్స్చేంజ్ బోనస్ కూడా రూ. 10 వేల వరకు లభిస్తుంది. అంటే ఈ కారుపై రూ. 20 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు లభిస్తున్నాయని చెప్పుకోవచ్చు.
4/ 10
అలాగే కంపెనీ ఇటీవల మార్కెట్లోకి తీసుకువచ్చింది. గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్‌పై కూడా ఆఫర్ ఉంది. అయితే దీనిపై ఎక్స్చేంజ్ ఆఫర్ తక్కువగా ఉంటుంది. ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.10 వేల తగ్గింపు వస్తుంది. అలాగే కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 3 వేలు ఉంది.
5/ 10
హ్యుందాయ్ ఆరా 2023 మోడల్‌పై అయితే క్యాష్ డిస్కౌంట్ రూ. 20 వేల వరకు ఉంది. అలాగే ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేల వరకు వస్తుంది. ఇంకా కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 3 వేలు ఉంది. దీంతో ఈ కారుపై మొత్తంగా రూ. 33 వేల వరకు తగ్గింపు ఉంది.
6/ 10
అలాగే 2022 మై గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్‌పై అయితే రూ. 50 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది. ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేల వరకు వస్తుంది. ఇంకా కార్పొరేట్ తగ్గింపు రూ. 3 వేల వరకు ఉంది. అంటే ఈ కారుపై మొత్తంగా రూ. 63 వేల తగ్గింపు వస్తుంది.
7/ 10
ఇంకా హ్యుందాయ్ ఆరా మోడల్‌పై అయితే రూ. 30 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఉంది. ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేల వరకు వస్తుంది. కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 3 వేలు ఉంది. దీంతో కారుపై రూ. 43 వేల తగ్గింపు వస్తుంది.
8/ 10
అదే హ్యుందాయ్ ఐ20 2022 మోడల్‌పై అయితే రూ. 20 వేల క్యాష్ డిస్కౌంట్ ఉంది. ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేల వరకు వస్తుంది. ఇంకా కార్పొరేట్ తగ్గింపు రూ. 3 వేలు ఉంది. ఈ కారుపై మొత్తంగా రూ. 33 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు ఉన్నాయి.
9/ 10
ఇక కోన ఈవీ 2022 మోడల్‌పై అయితే ఏకంగా రూ. 1.5 లక్షల దాకా క్యాష్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇకపోతే క్రెటా, వెన్యూ, వెన్యూ ఎన్ లైన్, ఐ20 ఎన్ లైన్, అల్కాజర్, వెర్నా, టుస్కన్, వంటి మోడళ్లపై ఎలాంటి ఆఫర్లు లేవు.
10/ 10
కాగా కారు ఆఫర్లు అనేవి ప్రాంతం, డీలర్షిప్ ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. అందువల్ల మీరు కారు కొనే టప్పుడు అన్ని వివరాలు తెలుసుకోవాలి. మీకు దగ్గరిలోని షోరూమ్‌కు వెళ్లి కారు ఆఫర్ల గురించి తెలుసుకోవచ్చు.