పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కు వెళ్లినప్పుడు ఇటీవలి కాలంలో ఎదురవుతున్న పెద్ద సమస్య క్యారీబ్యాగ్స్. క్యారీబ్యాగ్ వెంట తీసుకుపోకపోతే చాలు వారి వద్దనే కనీసం రూ. 3 నుంచి రూ.10, రూ.15 వరకు వెచ్చించి వారి వద్దే క్యారీబ్యాగ్ కొనాల్సిందే. దీంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇందేందని అడిగిడే మీ ఇష్టం ఉంటే కొనడం లేకపోతే.. మీ బ్యాక్ తెచ్చుకుని తీసుకెళ్లండని వారు ఏమాత్రం మొహమాటం లేకుండా చెబుతారు.(ప్రతీకాత్మక చిత్రం)
ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-3 వినియోగదారులకు శుభవార్త చెప్పింది. వినియోగదారులకు ఊరట కలిగేలా, పెద్ద పెద్ద మాల్స్ ఆటకట్టేలా తీర్పు ఇచ్చింది. లోగో ప్రింట్ చేసి ఉన్నా, లేకున్నా వినియోగదారులకు ఫ్రీగానే క్యారీ బ్యాగ్ లు అందించాలని తీర్పు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్ లోని తార్నాకకు చెందిన భగేల్కర్ ఆకాశ్ కుమార్ అనే వ్యక్తి 2019 మే 11 వ తేదీన హైదర్ నగర్ లోని డీమార్ట్ లో సరుకులు కొన్నారు. అయితే డీ మార్ట్ సిబ్బంది అతని వద్ద ప్లాస్టిక్ క్యారీబాగ్ కు రూ.3.50 బిల్లు వేశారు. అయితే ఆ క్యారీబ్యాగ్ పై సంస్థ పేరుతో కూడిన లోగోను ప్రింట్ కూడా చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)