HP Gas Booking: గ్యాస్ డెలివరీ బాయ్‌కి ఎక్స్‌ట్రా డబ్బులిస్తున్నారా?.. మీకో హెచ్చరిక

గ్యాస్ బుక్ చేసిన తర్వాత దాన్ని తీసుకుని ఇంటికి డెలివరీ చేసే వ్యక్తి సాధారణంగా జనాల నుంచి డబ్బులు వసూలు చేస్తుంటాడు. బిల్లు మీద కనీసం రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా వసూళ్లు చేస్తుంటారు. అయితే, అసలు గ్యాస్ డెలివరీ చేసే వారికి ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ప్రముఖ పెట్రోలియం సంస్థ HPCL ప్రకటించింది.