Sukanya Samriddhi Account: సుకన్య సమృద్ధి అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం ఎలా?
Sukanya Samriddhi Account: సుకన్య సమృద్ధి అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం ఎలా?
Sukanya Samriddhi Yojana | కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సుకన్య సమృద్ధి స్కీమ్ నుంచి డబ్బులు ఎలా విత్‌డ్రా చేసుకోవాలి? అలాగే ఎలాంటి డాక్యుమెంట్లు అందించాలి? వడ్డీ ఎలా లభిస్తుంది? వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Small Saving Schemes | కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. వీటిల్లో ఆడ పిల్లల కోసం కూడా ఒక స్పెషల్ స్కీమ్ అందుబాటులో ఉంది. అదే సుకన్య సమృద్ధి యోజన. ఈ స్కీమ్ కేవలం అమ్మాయిలకు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో చేరడం వల్ల పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు.
2/ 8
పదేళ్ల వరకు వయసు కలిగిన ఆడ పిల్లలు మాత్రమే సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరేందుకు అర్హత కలిగి ఉంటారు. ఒక ఇంట్లో ఇద్దరు అమ్మాయిల పేరుపై సుకన్య సమృద్ధి అకౌంట్‌ను ఓపెన్ చేయొచ్చు. కవలలు పుడితే ముగ్గురి పేరుపై కూడా ఈ ఖాతా తెరిచే వెసులుబాటు ఉంటుంది.
3/ 8
ఈ స్కీమ్‌లో చేరడం వల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి భారీ మొత్తం లభిస్తుంది.
4/ 8
ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.6 శాతం వరకు వడ్డీ వస్తోంది. ఈ వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారొచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం త్రైమాసికం చొప్పున స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను సమీక్షిస్తూ వస్దుంది. అయితే చాలా కాలం నుంచి ఈ స్కీమ్‌పై వడ్డీ రేటు స్థిరంగానే ఉంటూ వస్తోంది.
5/ 8
ఈ స్కీమ్‌లో చేరిన వారు ఏడాదికి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే కనీసం రూ. 500 ఇన్వెస్ట్ చేసిన చాలు. రూ. 250తో సుకన్య స్కీమ్ కింద అకౌంట్ తెరవొచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. అకౌంట్ తెరిచిన తర్వాత 15 ఏళ్ల పాటు డబ్బులు కట్టాలి.
6/ 8
సుకన్య అకౌంట్‌దారుడు మరణిస్తే.. అప్పుడు అకౌంట్ వెంటనే క్లోజ్ అవుతుంది. అకౌంట్లో ఉన్న డబ్బులు, వడ్డీ మొత్తం తిరిగి చెల్లిస్తారు. అకౌంట్‌దారుడు మరణించినా తర్వాత కూడా అకౌంట్ క్లోజ్ చేయకపోయినా అందులోని డబ్బులపై వడ్డీ వస్తూనే ఉంటుంది.
7/ 8
అమ్మాయికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత అకౌంట్లోని డబ్బులను విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. గరిష్టంగా 50 శాతం వరకు మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. లిమిట్ లోపు ఒకేసారి లేదంటే విడతల వారీగా డబ్బులను విత్‌డ్రా చేసుకునే ఆప్షన్ ఉంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
8/ 8
డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలని భావించే వారు విత్‌డ్రాయెల్ అప్లికేషన్ ఫామ్ సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఇతర ఐడెంటిఫికేషన్ సర్టిఫికెట్స్ కూడా అందించాలి. ఒకవేళ 21 ఏళ్ల తర్వాత కూడా డబ్బులు విత్‌డ్రా చేసుకోకపోతే అప్పుడు అందులోని డబ్బులకు ఎలాంటి వడ్డీ రాదు.