దాదాపు ప్రపంచ దేశాలన్నీ ద్రవ్యోల్బణం ఎదుర్కొంటున్నాయి. బడా కంపెనీలు ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇండియాలోనూ ఇందుకు భిన్నంగా పరిస్థితులు కనిపించడం లేదు. ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి, 6.5 శాతానికి తీసుకొచ్చింది. ఈ రేటు ఆధారంగానే వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ రుణాలు ఇస్తుంది.
ఇప్పుడు బ్యాంక్లు సెంట్రల్ బ్యాంక్ నుంచి తీసుకునే రుణాలపై అధిక వడ్డీని చెల్లించాలి. ఈ భారాన్ని కవర్ చేసుకునేందుకు బ్యాంకులు వినియోగదారులకు ఇచ్చే రుణాలపై వడ్డీని పెంచుతాయి. ఈ క్రమంలో మరోసారి హోమ్ లోన్ ఇంట్రెస్ట్ పెరిగే అవకాశం ఉందని అంచనా. ఈ క్రమంలో పెరిగే ఈఎంఐల భారాన్ని ఎలా తగ్గించుకోవచ్చనే అంశంపై Mt K కాపిటల్ కో ఫౌండర్, పార్ట్నర్ అబ్దేలీ తంబవాలా, పైసాబజార్ హోమ్ లోన్స్ హెడ్ రతన్ చౌదరి న్యూస్18 మాట్లాడారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
* కాస్ట్ ఆఫ్ EMI తగ్గించుకునే మార్గాలు : హోమ్ లోన్లు ఫిక్స్డ్, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్లతో ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్లు అందిస్తాయి. ఇవి వ్యక్తిగత రుణగ్రహీతల అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. ప్రస్తుతం హోమ్ లోన్ల వడ్డీ రేటు పెంపు భారం వినియోగదారులపై పడుతుంది. రుణం తీసుకున్న వ్యక్తులు పెరిగిన వడ్డీ రేటుకు అనుగుణంగా పెరిగిన EMIని చెల్లించాలి. లేదా రుణ కాలపరిమితిని పెంచమని బ్యాంకును కోరాలి. హోమ్ లోన్ EMI తగ్గించుకునే చర్యలపై ఓ లుక్కేయండి.
* ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీతో హోమ్ లోన్ : ఇలాంటి EMIలకు వడ్డీ రేటు 0.50% నుంచి 0.75% వరకు ఎక్కువగా ఉంటుంది. కస్టమర్ వడ్డీని ఆదా చేయడానికి ఓవర్డ్రాఫ్ట్ అకౌంట్లో అదనపు నిధులను ఉంచే అవకాశం ఉంది. సేవింగ్స్ అకౌంట్ రేట్ల కంటే హోమ్ లోన్ రేట్లు ఎక్కువగా ఉండటంతో, ఫండ్ జీవితకాలంలో ఇది గణనీయమైన పొదుపు కోసం ఉపయోగపడుతుంది.