రాబడి – ఖర్చుల మధ్య సమన్వయం కోసం కొంత ఎక్సర్సైజ్ తప్పదు. మనకు వచ్చే డబ్బు– మన అవసరాల జాబితాను సరిపోల్చుకోవాలి. నిత్యావసరాలు, పెద్దవాళ్ల ఆరోగ్యం కోసం రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు, మందుల కోసం కొంత కేటాయించాలి. పిల్లల చదువు, మిగిలిన అవసరాల కోసం కేటాయింపు తప్పని సరి. భవిష్యత్తు భద్రత కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేసి తీరాలి.
మీ ఖర్చులు, పొదుపు తర్వాత మిగిలిన డబ్బులో నుంచి సినిమాలు, వెకేషన్లు, ఇంట్లో ఖరీదైన ఫర్నిచర్, వాహనాల వంటి వాటికోసం ఖర్చు చేయాలి. పిల్లల పెరిగే కొద్ది వారి ఉన్నత విద్య కోసం ఖర్చు తగ్గించుకోవడానికి మధ్య తరగతి కుటుంబాల్లో సినిమానో, వెకేషన్నో మానుకోవాల్సి వస్తుంటుంది. ఆరోగ్య సమస్యల కారణంగా ఊహించని ఖర్చు వచ్చినప్పుడు కూడా కొన్ని సరదాలకు చెక్ పెట్టుకోవాల్సి ఉంటుంది.
(ప్రతీకాత్మక చిత్రం)