ప్రకటనలను చదవడం ద్వారా ఆదాయం: ఆన్ లైన్ లో యాడ్స్ చదవడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. అలాంటి వెబ్ సైట్స్ చాలానే ఉన్నాయి. మీరు ఆయా వెబ్ సైట్స్ లో సైన్ అప్ అయ్యి.. ప్రకటనలను చదవాలి. తరచు లాగిన్ అయ్యి.. మీ అకౌంట్ డ్యాష్ బోర్డులోని యాడ్స్ ని క్లిక్ చేయాలి. కంప్యూటర్ పై 10-20 నిమిషాలు పనిచేసి బాగానే సంపాదించవచ్చు.
ఆన్ లైన్ లో ఫొటోల అమ్మకం: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. వాటితో ఫొటోలు క్లిక్ మనిపిస్తున్నారు. ఐతే ఆ ఫొటలతో డబ్బులు సంపాదించవచ్చు. ప్రక్రుతి, జంతవులు, పర్యాటక ప్రాంతాలు, పండగలు, జీవన విధానానికి సంబంధించి ఫొటోలు తీసి ఫొటో సెల్లింగ్ వెబ్ సైట్స్ కు అమ్ముకోవచ్చు. PhotoBucket, Shutterstock, iStock వంటి వెబ్ సైట్లు అలాంటి ఫొటోలను కొని వేరొకరికి అమ్ముకుంటాయి.