How to earn money on Instagram: ఇన్‌స్టా గ్రాంలో ఇలా చేస్తే డబ్బే డబ్బు..
How to earn money on Instagram: ఇన్‌స్టా గ్రాంలో ఇలా చేస్తే డబ్బే డబ్బు..
మీరు కూడా సోషల్ మీడియా వేదికగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా? ముఖ్యంగా ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టా గ్రామ్ ద్వారా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా? ఎలా సంపాదించవచ్చో తెలుసుకోండి.
డబ్బు సంపాదించం ఎలా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ బాగా నడుస్తుండడంతో దీని చుట్టూ చాలా పెద్ద ఎత్తున వ్యాపారం నడుస్తోంది.
2/ 14
మీరు కూడా సోషల్ మీడియా వేదికగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా? ముఖ్యంగా ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టా గ్రామ్ ద్వారా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా? ఎలా సంపాదించవచ్చో తెలుసుకోండి.
3/ 14
భవనం కట్టాలంటే పునాది అవసరం. అలాగే ఇన్ స్టా గ్రామ్‌కి కూడా వర్తిస్తుంది. ఇన్ స్టా గ్రామ్‌లో డబ్బు సంపాదించాలంటే ముందు దాని మీద మీర కొంత సమయం కేటాయించాలి. దాన్ని దీర్ఘకాలంలో ఆదాయం వచ్చే వనరుగా మార్చుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.
4/ 14
మీరు దేంట్లో నిపుణులో గుర్తించి దానికి సంబంధించిన పోస్టులు అందులో పెడుతూ ఉండాలి. మీరు బాగా టిక్ టాక్ వీడియోలు చేస్తుంటే వాటిని పోస్ట్ చేస్తుండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 14
ఒకవేళ మీరు బాగా ట్రావెలింగ్ చేసేవారు అయితే, దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, సమాచారం అందులో అప్ డేట్ చేస్తుండాలి.
6/ 14
ఇలా మీకు వచ్చిన, మీకు నచ్చిన అంశాలను రెగ్యులర్‌గా అప్ డేట్ చేయడం ద్వారా మీరు మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకోగలుగుతారు. పెద్ద సంఖ్యలో ఫాలోయర్లు ఏర్పడిన తర్వాత మీకు రాబడి మొదలవుతుంది.
7/ 14
మీరు పోస్ట్ చేసే ఫొటోలు, వీడియోలను ఇన్ స్టా గ్రామ్‌లో జనం విరగబడి చూస్తున్నారంటే మిమ్మల్ని బ్రాండ్ ప్రమోషన్ల కోసం చాలా కంపెనీలు మీ వద్దకే వస్తాయి. కేవలం ఒక్క రోజు మీరు ఆ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తే వారు మీకు పెద్ద ఎత్తున డబ్బు చెల్లిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 14
ఇక ట్రావెలింగ్ చేసే వారయితే, ట్రావెల్స్ కంపెనీలు, ప్రముఖ టూరిజం సంస్థలు మిమ్మల్ని కలిసి మీ ద్వారా ప్రమోషన్స్ చేయిస్తాయి. అందుకు పెద్ద ఎత్తున డబ్బులు చెల్లిస్తాయి.
9/ 14
ఇవి రెండు మాత్రమే కాదు. అన్ని రకాలైన విషయాల్లోనూ ఇన్ స్టాలో ప్రమోషన్ చేస్తుంటారు. కాబట్టి, మీరు కూడా రెగ్యులర్ అప్ డేట్స్ ఇస్తూ ఫాలోయర్లను పెంచుకుంటూ పోతే మీరు ఇన్ఫ్లుయెన్సర్లుగా మారతారు. ఆ తర్వాత డబ్బే డబ్బు.
10/ 14
ఇటీవల కాజల్ అగర్వాల్, నిహారిక కొణిదెల, సమంత సహా చాలా మంది ప్రముఖులు మాల్దీవులకు విహారయాత్రలకు, హనీమూన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.
11/ 14
వీరంతా ఇన్ స్టాలో యాక్టివ్‌గా ఉంటూ తమ రెగ్యులర్ అప్ డేట్స్ ఇవ్వడం ద్వారా మిలియన్ల సంఖ్యలో ఫాలోయర్లను సాధించారు.
12/ 14
ఇలాంటి వారిని సెలక్ట్ చేసిన మాల్దీవులు టూరిజం శాఖ వారికి ఫ్రీ ట్రిప్‌లను ఆఫర్ చేసింది. వెళ్లి రావడానికి, అక్కడ ఉండడానికి, విందు, వినోదం వగైరా అంతా వాళ్లే చూసుకుంటారు. (Instagram/Photo)
13/ 14
కేవలం మాల్దీవులకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాలో అప్ లోడ్ చేస్తే చాలన్నమాట. అందుకే హీరోయిన్లు ఇన్‌స్టాలో తెగ ఫొటోలు షేర్ చేశారన్న విషయం గుర్తుంచుకోవాలి. ( pics Instagram)
14/ 14
ఇన్ స్టాలో ఎన్ని మిలియన్ల ఫాలోయర్లు ఉంటే అంత పెద్ద పెద్ద ఆఫర్లు వస్తుంటాయి. అటు డబ్బు, ఇటు ట్రిప్‌లు ఇలా అన్నీ పొందవచ్చు.