* రూ.10 కోట్లు సంపాదించేందుకు ఎంత కాలం పడుతుంది? : ముందుగా రూ.25,000 మంత్లీ సిప్‌తో ఇన్వెస్ట్మెంట్ మొదలైంది అనుకుందాం. ఒకవేల సిప్ చేసిన మొత్తానికి 8 శాతం లెక్కన రిటర్న్ వస్తే 42 సంవత్సరాలకు రూ.1.2 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు అవుతుంది. మొత్తంగా రూ.10.4 కోట్లు అందుతుంది. అదే విధంగా 10 శాతం లెక్కన 36 సంవత్సరాల్లోనే రూ.1.08 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.10.6 కోట్లు జనరేట్ అవుతుంది. 12 శాతం లెక్కన చూస్తే 31 ఏళ్లలోనే రూ.0.93 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.9.97 కోట్లు అందుతుంది.
అదే విధంగా మంత్లీ 10 శాతం స్టెప్ అప్ సిప్ చేస్తే 8 శాతం రిటర్న్‌తో 29 నెలల్లో రూ.4.45 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.10.6 కోట్లు సంపాదించవచ్చు. ఇదే విధంగా 10 శాతం రిటర్న్ అనుకుంటే 27 నెలలకు రూ.3.63 ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.10.8 కోట్లు వస్తుంది. 12 శాతంతో 25 నెలలకు రూ.2.95 కోట్ల పెట్టుబడితో రూ.10.7 కోట్లు జనరేట్ అవుతుంది.
అదేవిధంగా మార్కెట్ అస్థిరతను గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉండి, అధిక ఈక్విటీ రిస్క్‌ను తీసుకొంటే సంవత్సరానికి సగటున 12 శాతం రాబడి అందవచ్చు. అదే రిటర్న్‌ను స్టెప్-అప్ SIPకు అమలు చేస్తే.. ప్రతి సంవత్సరం 10 శాతం పెట్టుబడి పెరుగుతుంది. మొదటి సంవత్సరంలో రూ.25,000 నెలవారీ SIPతో మొదలైతే.. రెండవ సంవత్సరంలో ఈ మొత్తం రూ.27,500 అవుతుంది. ఇది ఇలా పెరుగుతూ పోతుంది.
* టాప్-అప్ SIPలు ఎందుకు సహాయపడతాయి :SIP సాధారణ స్టెప్-అప్‌తో రూ.10 కోట్లు సంపాదించాలనే లక్ష్యం త్వరగా నెరవేరుతుంది. దీని ద్వారా సమయాన్ని ఆరు నుంచి 13 సంవత్సరాల వరకు తగ్గించవచ్చు. ఆదాయం పెరిగేకొద్దీ ఇన్వెస్ట్ చేస్తున్న మొత్తాన్ని పెంచడం వల్ల త్వరగా లక్ష్యాలకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. ఇలా చిన్న మొత్తంలో డబ్బును పోగుచేసి పెద్ద మొత్తంలో సంపదను సృష్టించవచ్చు.
* నంబర్లు చూపని అంశాలు : నంబర్లలో వివరాలను చూసినప్పుడు సులువుగా అనిపిస్తుంది. అయితే క్రమశిక్షణతో ఉండటం అందరికీ సాధ్యం కాదు. క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం, యువకులుగా ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టి దీర్ఘకాలం కొనసాగించడం అందరికీ సాధ్యం కాదు. సంపద సృష్టి కోసం 2-3 దశాబ్దాల పాటు వేచి ఉండటం చాలా గొప్ప విషయం. ప్రత్యేకించి మార్కెట్లు సపోర్ట్ చేయని సమయంలో ఇతర షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటే పోర్ట్‌ఫోలియోను బ్రేక్ చేయాలని ఆలోచిస్తారు. ఈ తీరు నష్టాలను తెస్తుంది.
* ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? : క్విక్ రిటర్న్స్ కంటే క్వాలిటీ రిటర్న్స్ అందే సింపుల్ ప్రొడక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. తరచుగా అధిక రిస్క్ తీసుకునే ప్రలోభాలకు దూరంగా ఉండాలి. క్యాపిటల్‌ను కాపాడుకునేందుకు శ్రద్ధ చూపాలి. రూ.కోటి లేదా రూ.10 కోట్లు సంపాదించే లక్ష్యం ఉన్నా రిటర్న్స్ కాంపౌండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవడం ముఖ్యం.