కోవిడ్-19 మహమ్మారి కారణంగా దాదాపు రెండేళ్లు అన్ని వ్యాపార రంగాలు దెబ్బతిన్నాయి. రియల్ ఎస్టేట్(Real Estate) రంగం కూడా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంది. అయితే ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ మార్కెట్లో డిమాండ్(Demand) కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బలమైన డిమాండ్ 2022-23 లో కొనసాగుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి గృహ విక్రయాలు సంవత్సరానికి దాదాపు 12 శాతం పెరగవచ్చని ఇండియా రేటింగ్స్ నివేదిక పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
రేటింగ్ ఏజెన్సీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై పాజిటివ్ వైఖరిని వ్యక్తం చేసింది. ఇండియా రేటింగ్స్ తన నివేదికలో.. ‘మహమ్మారి ప్రభావం, పరిశ్రమ సమస్యలు, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా భారతీయ రియల్ ఎస్టేట్ రంగానికి ఆర్థిక సంవత్సరం 2023లో డిమాండ్ పెరగనుంది. ఆర్థిక సంవత్సరం 2022 లో స్థిరమైన పనితీరు, వేగవంతమైన పునరుద్ధరణ ఈ రంగం కొనుగోలుదారుల నమ్మకాన్ని తిరిగి పొందడంలో సహాయపడింది’ అని పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
2021-22 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఎనిమిది రియల్ ఎస్టేట్ క్లస్టర్లలో మహమ్మారి ప్రభావం ఉన్న సమయంలో గృహాల విక్రయాలు 42 శాతం పెరిగాయి. ఆర్థిక సంవత్సరం 2023లో సుప్రసిద్ధ విశ్వసనీయ డెవలపర్లు మెరుగైన విక్రయాలను చూస్తారని, ఆఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులు మొత్తం అమ్మకాలలో దాదాపు 50 శాతం వాటాను క్లెయిమ్ చేస్తాయని ఆశిస్తున్నట్లు ఇండియా రేటింగ్స్ నివేదిక పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
భారతదేశంలో గృహాల విక్రయాల పెరుగుదల ఇంతవరకు ధరల పెరుగుదలతో ముడిపడిలేదు. దీర్ఘకాలిక క్షీణత తర్వాత, గత కొన్ని సంవత్సరాలుగా ధరలు స్థిరంగా ఉన్నాయి. బెంగళూరు, ముంబై, పూణె, హైదరాబాద్ నేతృత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఆర్థిక సంవత్సరం 2023లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ ధర 8 శాతం మేర పెరుగుతుందని ఇండియా రేటింగ్స్ నివేదిక అంచనా వేసింది. మిలీనియల్స్ నుంచి గణనీయమైన డిమాండ్ రావడంతో హౌసింగ్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. భారతదేశం 400 మిలియన్ మిలీనియల్స్‌కు నివాసంగా ఉంది. మొత్తం జనాభాలో మూడింట ఒక వంతు, మొత్తం శ్రామిక శక్తిలో 46 శాతం ఉన్నారు. ఇది ప్రతి సంవత్సరానికి పెరుగుతూనే ఉంది.
ప్రతి సంవత్సరం మెట్రోపాలిటన్ నగరాల్లోకి వలస వస్తున్న జనాభా పెరుగుతోంది. విపణిలో కొనసాగుతున్న కన్సాలిడేషన్ కారణంగా ఆర్థిక సంవత్సరం 2023లో టైర్-1 రెసిడెన్షియల్ కంపెనీలు బలమైన అమ్మకాలను నమోదు చేస్తాయి. టైర్ II డెవలపర్ల నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లకు సంబంధించి గృహ కొనుగోలుదారులు ఆచితూచి వ్యవహరించడంతో టైర్-I పోలిస్తే వ్యత్యాసం కనిపిస్తోంది. స్థానికంగా బలమైన కంపెనీలు వృద్ధిని నమోదు చేస్తున్నాయి. బ్రాండ్లు కస్టమర్ ప్రాధాన్యతను గెలుచుకోవడంతో ఈ రంగం వేగంగా పుంజుకొంటోందని నివేదిక పేర్కొంది.