కరోనా కాలంలోనూ హైదరాబాద్ లో ఇళ్ల నిర్మాణం, అమ్మకాల వేగం ఏమాత్రం తగ్గలేదు. ఇలాంటి కష్టకాలాలు ఎదురైనప్పుడు సొంత ఇళ్లు ఉండాలని ప్రజలు భావించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఈ మేరకు స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక వివరాలను వెల్లడించింది. ఈ ఏడాది జనవరి-జూన్ నెలల్లో హైదరాబాద్ మహానగరంలో 16,712 కొత్త ఇళ్లు/ఫ్లాట్ల నిర్మాణం ప్రారంభమైందని నివేదనిక వెల్లడైంది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
అయితే అందులో 11,974 ఇళ్లు/ఫ్లాట్ల అమ్మకాలు జరిగాయని పేర్కొంది. ఇదిలా ఉంటే గత ఏడాది ఇదే సమయంలో కేవలం 4,422 కొత్త ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని నివేదిక వివరించింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
దీంతో ఈసారి 278 శాతం నిర్మాణాలు అధికమయ్యాయని నివేదిక వివరించింది. అయితే.. ఆ సమయంలో 4,782 ఇళ్లు అమ్ముడు పోగా.. ఈసారి 150 శాతం వృద్ధి నమోదైనట్లు నివేదిక వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
దీంతో పాటు అమ్మకానికి రెడీగా ఉన్న ఇళ్లు/ఫ్లాట్ల సంఖ్య కూడా ఏడాది వ్యవధిలో 4,037 నుంచి 11,918 కి పెరిగినట్లు నివేదిక వివరించింది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాలతో పోల్చితే మాదాపూర్, గచ్చిబౌలి, కోకాపేట, రాయదుర్గం, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు, విక్రయాలు అధికంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)