1. ప్రతి సంవత్సరం పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా ఆదాయ పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయాలి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2023-24) ప్రస్తుత సంవత్సరం జులై 31వ తేదీలోగా ITRని ఫైల్ చేయాలి. నెట్ ట్యాక్స్ లయబిలిటీ, ట్యాక్స్ డిడక్షన్స్ క్లెయిమ్, గ్రాస్ ట్యాక్సబుల్ ఇన్కం వంటి సమాచారంతో ఐటీఆర్ ఫైల్ (ITR Filing) చేసేటప్పుడు అలవెన్సులు సహాయపడతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఎక్కువ మంది సెక్షన్ 10 కింద ఉన్న, ఫారం 16లో పేర్కొన్న అలవెన్సులను క్లెయిమ్ చేస్తారు. ఫారం 16 అనేది తప్పనిసరిగా ఆయా సంస్థలు వారి ఉద్యోగులకు వారి ఇన్కమ్, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్(TDS), ఇతర సమాచారం పేర్కొంటూ జారీ చేసే సర్టిఫికేట్. ఫారం 16లో ఐటీఆర్ సిద్ధం చేయడానికి, ఫైల్ చేయడానికి అవసరమైన సమాచారం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. హౌస్ రెంట్ అలవెన్సు(సెక్షన్ 10(13A)): అద్దె ఇంట్లో నివసించే ఉద్యోగులు HRAపై ట్యాక్స్ ఎగ్జమ్షన్ క్లెయిమ్ చేయవచ్చు. ఎగ్జమ్షన్ పొందే మొత్తం, అందుకున్న HRA మొత్తం కన్నా తక్కువగా ఉండాలి. మెట్రో నగరాల్లో నివసిస్తుంటే జీతంలో 50 శాతం (బేసిక్ శాలరీ+ డియర్నెస్ అలవెన్స్) లేదా మెట్రోయేతర నగరాల్లో 40 శాతం ఎగ్జమ్షన్ క్లెయిమ్ చేయవచ్చు. సంవత్సరంలో యాన్యువల్ శాలరీ(బేసిక్ శాలరీ+ DA)లో 10% కంటే ఎక్కువగా చెల్లించే అద్దె కంటే ఎక్కువ ఉండకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)
5. లీవ్ ట్రావెల్ కన్సెషన్ లేదా అసిస్టెన్స్ (LTC/LTA) (10(5)): ఈ అలవెన్సు కింద ఉద్యోగి భారతదేశంలో చేసే ప్రయాణ ఖర్చులను ట్యాక్స్ ఫ్రీగా పరిగణిస్తారు. ఉద్యోగుల విహారయాత్రలో ఛార్జీల ఖర్చులు యజమాని ద్వారా ట్యాక్స్ ఫ్రీ అలవెన్సు కింద పరిగణిస్తారు. ట్రైన్, ఫ్లైట్, లేదా ప్రజా రవాణా ద్వారా ప్రయాణించి ఉండాలి. 4 క్యాలెండర్ ఇయర్లలో రెండు ప్రయాణాలకు ఎగ్జమ్షన్ ఉంటుంది. ఈ ఎగ్జమ్షన్ యజమాని అందించిన LTA ఆధారంగా ఉంటుంది. ఇంకా సెక్షన్ 10 (14) కింద కొన్ని అలవెన్సులు ఉన్నాయి. ఇవి అలవెన్సు రూపంలో సంపాదించిన మొత్తం లేదా నిర్దిష్ట విధులపై ఖర్చు చేసిన మొత్తంలో ఏది తక్కువగా ఉంటే దానికి ఎగ్జమ్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. రీలొకేషన్ అలవెన్సు: వ్యాపార కారణాల వల్ల వేరే నగరానికి మారమని కంపెనీలు ఉద్యోగులను అడుగుతాయి. యజమాని కారు రవాణా ఖర్చులు, కారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ప్యాకేజింగ్ ఛార్జీలు, మొదటి 15 రోజుల వసతి, రైలు/విమాన టిక్కెట్లపై చేసిన ఖర్చులను తిరిగి చెల్లిస్తారు. ఈ రీయింబర్స్మెంట్లకు పన్ను మినహాయింపు ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. పుస్తకాలు, పీరియాడికల్ అలవెన్సు: పుస్తకాలు, వార్తాపత్రికలు, పత్రికలు, జర్నల్స్ మొదలైన వాటి కోసం చేసిన ఖర్చులపై ఆదాయ పన్ను చట్టం ప్రకారం పన్ను రహిత రీయింబర్స్మెంట్ లభిస్తుంది. అందించిన రీయింబర్స్మెంట్ బిల్లు మొత్తం లేదా జీతంలో అందించిన ప్యాకేజీలో తక్కువగా ఉన్నదానికి ఎగ్జమ్షన్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)