ఎక్కువగా పర్యటనలు చేపట్టేవారు సరైన ప్రణాళిక చేసుకోకపోతే ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రయాణాలు చేసే సమయంలో హోటల్ క్రెడిట్ కార్డ్ ఉంటే ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయవచ్చు. అదే విధంగా డబ్బు కూడా ఆదా అవుతుంది. ఈ క్రెడిట్ కార్డుల ద్వారా హోటల్ బుకింగ్‌లపై ప్రత్యేకమైన ఆఫర్లు, రివార్డ్ పాయింట్లు, రూమ్ అప్గ్రేడ్లు, ఉచిత బస వంటి ఇతర ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. హోటల్ బుకింగ్‌లు, ఇతర ప్రయాణ ప్రయోజనాల కోసం ఉపయోగించగలిగే ఐదు ఉత్తమ క్రెడిట్ కార్డ్‌లు ఇవే.. (ప్రతీకాత్మక చిత్రం)
* SBI కార్డ్:
యాత్ర SBI క్రెడిట్ కార్డ్ స్వాగత బహుమతిగా రూ.8,250 విలువైన యాత్ర వోచర్లను అందిస్తుంది. ఈ కార్డ్‌పై కనీస లావాదేవీ విలువ రూ.3,000పై దేశీయ హోటల్ బుకింగ్‌లపై 20 శాతం తగ్గింపును కూడా అందిస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి రూ.5,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన దేశీయ విమాన బుకింగ్‌లపై రూ.1,000 తగ్గింపు, రూ.40,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన అంతర్జాతీయ విమాన బుకింగ్‌లపై రూ.4,000 తగ్గింపును వినియోగదారులకు అందిస్తోంది. ఈ క్రెడిట్ కార్డ్‌కు వార్షిక రుసుము రూ.499 చెల్లించాల్సి ఉంటుంది.
* యాక్సిస్ బ్యాంక్:
Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ Cleartrip, Cure.fit, PVR, Swiggy, Uber మొదలైన వాటిపై 4 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. Flipkart, Myntraలో షాపింగ్ చేసేటప్పుడు 5 శాతం క్యాష్‌బ్యాక్, అన్ని ఇతర లావాదేవీలపై 1.5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. చేసిన ఖర్చుపై క్యాష్‌బ్యాక్‌తో పాటు, సంవత్సరంలో కార్డ్ హోల్డర్ 4 డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్‌లను పొందుతారు. ఈ క్రెడిట్ కార్డుకు వార్షిక రుసుము రూ.500 చెల్లించాలి. ప్రతీకాత్మక చిత్రం (ప్రతీకాత్మక చిత్రం)
*HDFC బ్యాంక్:
HDFC డైనర్స్ క్లబ్ ప్రివిలేజ్ క్రెడిట్ కార్డ్ MMT, క్లియర్‌ట్రిప్, యాత్ర ద్వారా విమాన/హోటల్ బుకింగ్‌లపై 10X రివార్డ్ పాయింట్లను అందిస్తుంది. ఇది ప్రతి రూ.150 ఖర్చు చేసినందుకు 4 రివార్డ్ పాయింట్లను, వారాంతాల్లో డైనింగ్‌పై 2X రివార్డ్ పాయింట్లను అందిస్తుంది. ఇది భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా కాంప్లిమెంటరీ 12 విమానాశ్రయ లాంజ్ యాక్సెస్‌లను అందిస్తుంది. ఈ కార్డుపై యాన్యువల్ ఫీజు రూ.2,500 ఉంది.
* ICICI బ్యాంక్:
* ICICI బ్యాంక్:
MakeMyTrip ICICI బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ కాంప్లిమెంటరీ MMTBLACK సభ్యత్వాన్ని, మై క్యాష్ నగదు రూ.1,500, రూ.2,500 విలువైన MakeMyTrip (MMT) హాలిడే వోచర్‌ను స్వాగత ఆఫర్ కింద అందిస్తుంది. ఇది MMT ద్వారా హోటల్/హాలిడే బుకింగ్‌లపై ఖర్చు చేసే రూ.200కి మై క్యాష్ 4, MMT ద్వారా ఫ్లైట్ బుకింగ్‌లపై వెచ్చించే రూ.200కి మై క్యాష్ 2 అందిస్తుంది. ఈ కార్డ్ తీసుకొనే ముందు రూ.2,500 చెల్లించాలి. యాన్యువల్ ఫీజు లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
* స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్:
స్టాండర్డ్ చార్టర్డ్ డిజిస్మార్ట్ క్రెడిట్ కార్డ్ దేశీయ విమాన టిక్కెట్లను బుక్ చేసేటప్పుడు 20 శాతం (రూ.750 వరకు)తగ్గింపును అందిస్తుంది. యాత్ర ద్వారా రూ.10,000 వరకు అంతర్జాతీయ విమాన టిక్కెట్లను బుక్ చేసుకుంటే 10 శాతం తగ్గింపును అందిస్తుంది. ఇది త్రైమాసికానికి ఒకసారి దేశీయ హోటల్ బుకింగ్‌లపై 25 శాతం(రూ.4,000 వరకు) తగ్గింపు, ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ క్రెడిట్ కార్డుకు వార్షిక రుసుము రూ.588 చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)