ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి హోటళ్లలో తప్పనిసరి క్వారంటైన్ నిబంధనను రద్దు చేస్తున్నట్లు ఇటీవల హాంగ్ కాంగ్ ప్రభుత్వం ప్రకటించింది. అక్కడకు వెళ్లే ప్రయాణికులు అందరికీ విమానం ఎక్కడానికి 48 గంటల ముందు నెగిటివ్ ఆర్టీ పీసీఆర్ రిపోర్టు అవసరం లేదు. కానీ ఇప్పుడు వారు విమానం ఎక్కడానికి 24 గంటల ముందు నెగిటివ్ యాంటీజెన్ టెస్ట్ రిపోర్టును చూపించాల్సి ఉంటుంది.