ఇండియన్ టూ-వీలర్ మార్కెట్లో మోటార్ సైకిళ్లదే హవా. ప్రజల అవసరాలు, బడ్జెట్‌కు తగ్గట్లు వివిధ మోడళ్లను కంపెనీలు డిజైన్ చేస్తుంటాయి. ఇలా మార్కెట్లోకి వచ్చిన వాటిలో కొన్ని బైక్స్ పాపులర్ అయ్యాయి. 100cc, 120cc, 150cc.. ఇలా ఇంజిన్ కెపాసిటీ ఆధారంగా, ఒక్కో విభాగంలో కొన్ని వెహికల్స్ ఎక్కువ సేల్స్‌తో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా 100cc సెగ్మెంట్లో హీరో HF డీలక్స్, హీరో స్పెండర్ ప్లస్, బజాజ్ ప్లాటినా 100 మోడళ్లు సూపర్ హిట్ అయ్యాయి.
* మిగతా మోడళ్ల ప్రత్యేకతలు : బజాజ్ ప్లాటినా 100 వేరియంట్ 102cc, 4-స్ట్రోక్, DTS-i, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 7.9PS పవర్‌ను, 8.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయ్యి ఉంటుంది. హీరో స్ప్లెండర్ ప్లస్, హీరో HF డీలక్స్ మోడల్స్ రెండూ 97.2cc, ఎయిర్ కూల్డ్, 4 స్ట్రోక్, సింగిల్ సిలిండర్, OHC ఇంజిన్‌తో వస్తాయి. ఈ మోటార్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయ్యి ఉంటుంది. ఈ ఇంజిన్ 8.02PS పవర్‌ను, 8.05Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.