కాగా మరోవైపు టాటా మోటార్స్ కూడా తన కార్లపై రూ. 60 వేల వరకు తగ్గింపు అందుబాటులో ఉంచింది. ఇక మారుతీ సుజుకీ కార్లపై భారీ తగ్గింపు పొందొచ్చు. రూ. 50 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. కారు కొనే వారికి ఇలా పలు రకాల డిస్కౌంట్ ఫర్లు లభిస్తున్నాయి. ఆఫర్లు కారు వేరియంట్ ప్రాతిపదికన కూడా మారతాయి. ఇంకా ప్రాంతం, కారు మోడల్, షోరూమ్ ప్రాతిపదికన కూడా ఆఫర్లలో మార్పులు ఉండొచ్చు. అందువల్ల మీరు కారు కొనాలని భావిస్తే.. దగ్గరిలోని డీలర్ షిప్‌కు వెళ్లి ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.