హోండా డబ్ల్యూఆర్వీ మోడల్‌పై గరిష్టంగా రూ. 72,340 వరు తగ్గింపు లభిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 30 వేల వరకు ఉంది. లేదంటే రూ. 35,340 వరకు విలువైన ఉచిత యాక్ససిరీస్ పొందొచ్చు. అలాగే కస్టమర్లు కారు ఎక్స్చేంజ్పై రూ. 20 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే హోండా కస్టమర్లకు అయితే లాయల్టీ బోనస్ కింద రూ. 5 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5 వేల వరకు ఉంది. హోండా కారు ఎక్స్చేంజ్ బోనస్ రూ. 7 వేల వరకు లభిస్తుంది.
హోండా సిటీ 5వ జనరేషన్ కారుపై అయితే రూ. 72,145 వరకు తగ్గింపు పొందొచ్చు. క్యాష్ డిస్కౌంట్ రూ. 30 వేల వరకు ఉంది. లేదంటే రూ. 32,145 వరకు విలువైన ఉచిత యాక్ససిరీస్ పొందొచ్చు. హోండా కస్టమర్లకు కార్పేరేట్ డిస్కౌంట్ రూ. 8 వేల వరకు, ఎక్స్చేంజ్ బోనస్ రూ. 5 వేలకు లభిస్తున్నాయి. లాయల్టీ బోనస్ రూ. 5 వేలు పొందొచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.20 వేల తగ్గింపు వస్తుంది.
హోండా అమేజ్ కారుపై అయితే ఇయర్ ఎండ్ డిస్కౌంట్ రూపంలో రూ. 43,144 వరకు తగ్గింపు పొందొచ్చు. క్యాష్ డిస్కౌంట్ రూ. 10 వేల వరకు ఉంది. లేదంటే రూ. 12,144 వరకు ఉచిత యాక్ససిరీస్ పొందొచ్చు. అలాగే కారు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ. 20 వేల వరకు తగ్గింపు ఉంది. లాయల్టీ బోనస్ కింద రూ. 5 వేల వరకు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ. 6 వేల వరనకు తగ్గింపు లభిస్తోంది.
హోండా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు జాజ్‌పై కూడా ఆఫర్ ఉంది. ఈ కారుపై రూ. 37 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. క్యాష్ డిస్కౌంట్ రూ. 10 వేల వరకు ఉంది. లేదంటే రూ. 12 వేల వరకు విలువైన ఉచిత యాక్ససిరీస్ పొందొచ్చు. కారు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ. 10 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఇంకా లాయల్టీ బోనస్ రూ. 5 వేలు పొందొచ్చు. హోండా సిటీ 4వ జనరేషన్ కారుపై అయితే పెద్దగా ఆఫర్లు ఏమీ లేవు. లాయల్టీ బోనస్ కింద రూ. 5 వేల వరకు తగ్గింపు లభిస్తోంది.