1. స్కూటర్ మార్కెట్లో హోండా యాక్టీవా (Honda Activa) తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ నెలా టాప్ 1 స్కూటర్‌గా హోండా యాక్టీవా మార్కెట్లో అమ్ముడుపోతోంది. ఇతర స్కూటర్లన్నీ కలిపి ఒక నెలలో ఎన్ని యూనిట్స్ అమ్ముతాయో, దాదాపు అన్ని యూనిట్స్ హోండా యాక్టీవా అమ్ముడు పోతుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. హోండా యాక్టీవా వాహనానికి ఫ్యాన్స్ కూడా ఎక్కువ. ఇప్పుడు ఆ ఫ్యాన్స్‌కు హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (HMSI) గుడ్ న్యూస్ చెప్పింది. హోండా యాక్టీవా ఎలక్ట్రిక్ వెహికిల్ (Honda Activa EV) మార్కెట్లోకి రాబోతోంది. జనవరి 23న హోండా యాక్టీవా హైబ్రిడ్ మోడల్ లాంఛ్ చేసేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. హోండా 2-వీలర్స్ ఇండియా జనవరి 23న కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆవిష్కరించడానికి ఇప్పటికే మీడియాకు ఇన్విటేషన్స్ పంపింది. ఆ రోజున హోండా యాక్టివా హైబ్రిడ్ మోడల్ లాంఛ్ కావచ్చని భావిస్తున్నారు. కంపెనీ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోలో టీజర్‌ను విడుదల చేసింది. హెచ్-స్మార్ట్ ట్రేడ్‌మార్క్ పేరుతో ఈ టూవీలర్ రానుందని అంచనా. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఉత్పాదకతను పెంచడానికి, వినియోగదారులకు నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి రూపొందించిన కొత్త హైబ్రిడ్ టెక్నాలజీని హోండా త్వరలో విడుదల చేయనుంది. ఎలక్ట్రిక్ వాహనంలో రీజెనరేటివ్ టెక్నాలజీని ఉపయోగించి రీఛార్జ్ చేయబడిన ప్రత్యేక బ్యాటరీని ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు హైబ్రిడ్ సిస్టమ్‌ను కూడా కంపెనీ ఉపయోగించుకునే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. హైబ్రిడ్ టెక్నాలజీ గురించి హోండా ఇంకా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే ఇది 10-15 కిలోమీటర్ల ఎలక్ట్రిక్-ఓన్లీ రైడింగ్‌ను అందించగలిగితే భారతీయ ఆటో మార్కెట్లో గేమ్ ఛేంజర్ కావచ్చని అంచనా వేస్తున్నారు. పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌లో యాక్టివా గరిష్ట వేగం గంటకు 40 కిలోమీటర్లు ఉండొచ్చని అంచనా. జనవరి 23న హోండా హై-వోల్టేజ్, పటిష్టమైన హైబ్రిడ్ డిజైన్‌ను కూడా ప్రదర్శించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)