5. ఈ నేపథ్యంలో గృహ కొనుగోలు దారులు లోన్ తీసుకొనేటప్పుడు ముఖ్యంగార వడ్డీ రేట్లతోపా రిటైర్మెంట్కు ఎన్నేళ్ల కాలం మిగిలి ఉంది అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. చెల్లింపుల సామర్థ్యం, ఇతర జీవిత లక్ష్యాలు, వాటికి సంబంధించి చేయాల్సిన కేటాయింపులు అన్నీ చూసుకున్న తర్వాత గృహ రుణాన్ని అనుకూలమైన కాలవ్యవధికి తీసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ప్రాపర్టీ విలువలో బ్యాంకు మంజూరు చేసే రుణాన్ని లోన్ టు వ్యాల్యూ (ఎల్టీవీ)గా చెబుతారు. సాధారణంగా బ్యాంకులు ప్రాపర్టీ విలువలో 60–65 శాతం వరకు రుణంగా మంజూరు చేస్తుంటాయి. అదే ఎన్బీఎఫ్సీలు అయితే ఇంకొంచెం రిస్క్ చేసి 75 శాతం వరకు రుణంగా ఇస్తాయి. మిగిలిన మేర రుణ గ్రహీత స్వయంగా సమకూర్చుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. మొదటిసారి ఇళ్లు కొనే వారు గృహ రుణ రేటుతో పాటు.. ప్రాపర్టీ రేటు కూడా పరిగణలోకి తీసుకొని కొనుగోలు చేయాలి. కరోనా సంక్షోభానంతరం రియల్టీ మార్కెట్లో ధరలు పడిపోయి అక్కడి నుంచి కోలుకున్నాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. కనుక ప్రాపర్టీ ధరలతో ముడిపెట్టి గృహ రుణ రేటును చూడాలి. (ప్రతీకాత్మక చిత్రం)