Home Loan: సాధారణంగా ఇల్లు కొనడం లేదా కట్టడం ఎంత కష్టమో దానికి లోన్ తీసుకోవడం కూడా అంతే కష్టం అని చాలామంది భావిస్తుంటారు. దాని కోసం ప్రత్యేకంగా పేపర్ వర్క్ సిద్ధం చేసుకోవడం, బ్యాంకులను అప్రోచ్ అవ్వడం, లోన్ కోసం అప్లై చేయడం పెద్ద పని. అయితే వీటన్నింటిలోనూ తక్కువ వడ్డీకి మంచి ఆఫర్లతో రుణాన్ని అందించే బ్యాంకులను ఎంచుకోవడం కూడా కష్టమనే చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇబ్బందులన్నీ ఇకపై కాస్త తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. Easiloan.com అనే వెబ్ సైట్... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి ఇంటి యజమానికి ఇంటి సెలక్షన్‌తో పాటు రుణాలకు సంబంధించిన రికమండేషన్స్ కూడా అందించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈజీ లోన్ టెక్నో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (https://www.easiloan.com) అనేది ఓ కొత్త తరహా ఫిన్ టెక్ స్టార్టప్. ఈ సంస్థ వెబ్ సైట్లో మన వివరాలను అందించగానే ఈజీలోన్ ఇన్ స్టంట్ మ్యాచ్ అప్లికేషన్ ద్వారా దానికి మ్యాచయ్యే వివరాలన్నింటినీ చూపుతుంది. ఇది ఈ కోవలో మొదటిది అని ఆ సంస్థ చెబుతోంది. AI టెక్నాలజీతో పనిచేసే సెలక్షన్, రికమండేషన్ ఇంజిన్ ఇంటి రుణాల రంగంలోనే మొదటిది. (image credit - Easiloan.com)
ఇది కొత్త ఇళ్లు వెతుక్కునే వారికి, ఇంటి రుణం తీసుకోవాలనుకునేవారికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇంటి రుణాల రంగంలో ఉన్న కొన్ని లోపాలను పూడ్చుతూ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చి ఇళ్లు కొనేవారికి లోన్ ప్రాసెస్‌ని సులభతరం చేయడం మాత్రమే కాదు... డెవలపర్స్, అమ్మకందారులు, వ్యాపారస్థులకు కూడా సాయం చేయడమే ఈ పోర్టల్ ఉద్దేశం. (image credit - Easiloan.com)
ఈ పోర్టల్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్ (నేరుగా ఇళ్లు అమ్మేవారు), డెవలపర్స్, కస్టమర్లు, బ్యాంకర్లు, ఎన్బీఎఫ్సీలు అందరినీ ఒక గొడుగు కిందకు తీసుకువచ్చిందీ సంస్థ. దీంతో ఇళ్ల కొనుగోలు, బ్యాంకు రుణాలు అన్నీ ఒకే చోట జరిగిపోతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ సాయంతో కస్టమర్లు షార్ట్ లిస్ట్ చేసిన వాటిలోంచి బెస్ట్ ఎంపిక చేసుకునే వీలుంటుంది. (image credit - Easiloan.com)
దీని గురించి సంస్థ కో ఫౌండర్ ప్రమోద్ కథురియా మాట్లాడుతూ.. ‘కస్టమర్లు ఇల్లు వెతకడానికి పడే ఇబ్బంది, ఒత్తిడిని తీసేయాలనుకున్నాం. మీ డ్రీమ్ హోమ్ కోసం బెస్ట్ రుణాలను అందించే వ్యక్తులను మీకు చేరువ చేయాలనుకుంటున్నాం. మీ ప్రొఫైల్ ఆధారంగా మీకు తగిన ఇంటిని, వాటికి రుణాలను అందించే సంస్థలను మీకు చేరువ చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నాం. మా దగ్గర ఉన్న కస్టమర్ ప్రొఫైల్స్ అన్నీ ప్రీ క్వాలిఫైడ్ కాబట్టి చాలా తక్కువ సమయంలోనే రుణాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి’ అని వివరించారు. (image credit - Easiloan.com)
హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ, బజాజ్ హౌజింగ్ ఫైనాన్స్, పీఎన్బీ, ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్, వంటి వాటితో ఈ సంస్థ ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం ముంబైలో సేవలు అందిస్తున్న ఈ సంస్థ, త్వరలో పుణె, బెంగళూరులో తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈజీలోన్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్‌కి కూడా ఉపయోగపడనుంది. కస్టమర్ల ప్రొఫైల్స్ సిద్ధం చేసి వారికి లోన్స్ సులభంగా వచ్చేలా చేస్తుంది. బ్యాంకు రుణాలకు కూడా ఈజీలోన్ యాప్ ద్వారా అప్రూవల్ లభిస్తుంది. (image credit - Easiloan.com)