కొవిడ్(Covid-19) సమయంలో తక్కువ వడ్డీ రేట్లకే గృహ రుణాలు (Home Loans) లభించాయి. ఇప్పుడు ఆ గోల్డెన్ ఫేజ్ ముగిసినట్లే కనిపిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్యోల్బణాన్ని అరికట్టే లక్ష్యంతో 50 బేసిస్ పాయింట్ల(bps) రెపో రేటు పెంపును ప్రకటించింది. దీంతో రెపో మళ్లీ 5.40 శాతం ప్రీ-పాండమిక్ స్థాయికి చేరుకుంది. ఈ ఏడాదిలో మే లో మొదటిసారి ఆర్బీఐ రెపో రేటును పెంచింది. ఇటీవల మూడో సారి రెపో రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరం రెపో రేటు 140 బేసిస్ పాయింట్లు పెరిగింది.
* రుణ గ్రహీతలపై ప్రభావం : 2019 అక్టోబర్ 1 తర్వాత బ్యాంకులు మంజూరు చేసిన అన్ని ఫ్లోటింగ్-రేట్ రిటైల్ లోన్లు ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్‌తో లింక్ అయి ఉంటాయి. ఇది చాలా బ్యాంకులకు రెపోరేటుగా ఉంది. పాత వడ్డీ రేట్ సిస్టమ్‌లకు లింక్ అయిన గృహ రుణాలు.. మార్జినల్ కాస్ట్ - ఆఫ్ ఫండ్స్- బేస్డ్ లెండింగ్ రేటు(MCLR), బేస్ రేట్ కూడా ఖరీదైనవిగా మారతాయి. అధిక రెపో రేటు వాటి కాస్ట్ ఆఫ్ ఫండ్స్‌ను కూడా పెంచుతుంది.
* రుణగ్రహీతలు ఏం చేయాలి? : సాధారణంగా, బ్యాంకులు రేట్లు పెరిగినప్పుడు ఈక్వేటెడ్ నెలవారీ వాయిదా (EMI)ని పెంచే బదులు లోన్ టెన్యూర్‌ను పొడిగిస్తాయి. ఈ రెండు ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకుని అమలు చేయమని బ్యాంకును సంప్రదించవచ్చు. టెన్యూర్ పొడిగింపును ఎంచుకోవడం వలన EMI పెంచడం కంటే ఎక్కువ వడ్డీ ఖర్చు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
బ్యాంకులు లోన్ టెన్యూర్‌ను పొడిగించడాన్ని ఇష్టపడతాయి కాబట్టి, గృహ రుణ గ్రహీతలకు వడ్డీ ఔట్గో 15-25 సంవత్సరాల కాలవ్యవధిలో గణనీయంగా పెరుగుతుంది.అదే విధంగా.. EMI చెక్కుచెదరకుండా ఉంచుతూ బ్యాంకు టెన్యూర్‌ను పొడిగించాలని నిర్ణయించుకుంటే, తిరిగి చెల్లించే వ్యవధి 50 నెలలకు పైగా పెరుగుతుంది. అంటే 29 సంవత్సరాల రెండు నెలలకు పైగా వడ్డీ రేటు సవరణ కారణంగా అదనంగా చెల్లించే వడ్డీ దాదాపు రూ.18.57 లక్షలకు చేరుకుంటుంది.
* వడ్డీ ఆదా చేయడానికి ముందస్తుగా చెల్లించండి : 25 సంవత్సరాల టెన్యూర్‌లో 8.05 శాతానికి రూ.50 లక్షల గృహ రుణాన్ని తీసుకుంటే.. EMI రూ.38,757 అవుతుంది. ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండా సాధారణ EMIని చెల్లించడం కొనసాగిస్తే, 25 సంవత్సరాలలో మొత్తం రూ.66.27 లక్షల వడ్డీని చెల్లించాలి. పెరుగుతున్న రేటు వాతావరణంలో, లోన్ రీపేమెంట్ స్ట్రాటజీని పునరాలోచించుకోవాలని, వడ్డీ ఆదా చేయడానికి ముందస్తు చెల్లింపులను పరిగణించాలని నిపుణులు సూచిస్తున్నారు.
* ప్రతి సంవత్సరం మీ EMIలను 5-10 శాతం పెంచండి : క్రమబద్ధమైన, సాధారణ ముందస్తు చెల్లింపులు గృహ రుణాల బకాయి మొత్తాన్ని తగ్గించడంలో చాలా వరకు సహాయపడతాయి. జీతం ఏటా పెరుగుతుంది. అదే విధంగా ప్రతి సంవత్సరం EMIలను పెంచడాన్ని పరిగణించాలి. ప్రతి సంవత్సరం EMIలను కనీసం ఐదు శాతం పెంచితే.. గృహ రుణం ముందుగా పూర్తవుతుంది. వడ్డీ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది.
* ఒకేసారి ఎక్కువ చెల్లించండి : EMIలను పెంచడానికి నెలవారీ బడ్జెట్‌ను మేనేజ్ చేయడం అనిపిస్తే.. వార్షిక్ బోనస్‌లను సక్రమంగా ఉపయోగించాలి. ప్రతి సంవత్సరం ఎక్కువ మొత్తంలో ప్రీ-పేమెంట్ చేయగలిగితే, చాలా వరకు వడ్డీ మిగులుతుంది. టెన్యూర్ పీరియడ్ కంటే ముందు రుణాన్ని క్లియర్ చేయవచ్చు. ఎక్కువ ప్రీ-పేమెంట్ మొత్తం సహజంగానే చెల్లించాల్సిన మొత్తం వడ్డీలో ఎక్కువ తగ్గింపును సూచిస్తుంది.