రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేటును మరోసారి పెంచింది. దీంతో వివిధ బ్యాంకులు డిపాజిట్లతో పాటు లోన్లపై వడ్డీ రేటును పెంచుతున్నాయి. చాలా బ్యాంకులు లెండింగ్ బెంచ్‌మార్క్ రేటును పాలసీ రెపో రేటుతో అనుసంధానించాయి. అంటే పాలసీ రెపో రేటులో వచ్చే మార్పులు టర్మ్ లోన్ వడ్డీ రేట్లపై ప్రభావం చూపుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఆర్థిక సంస్థలు లిక్విడిటీ కొరత ఉన్నప్పుడు RBI నుంచి డబ్బు తీసుకుంటాయి. దీనిపై బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటును రెపో రేటు అంటారు. ఆర్బీఐ రెపో రేటును పెంచితే, రుణదాతలు బెంచ్ మార్క్ వడ్డీరేటును పెంచుతాయి. అంటే హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, కార్ లోన్లపై వడ్డీ పెరుగుతుంది. ఫలితంగా చివరకు వినియోగదారులపై రేట్ల పెంపు ప్రభావం పడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
హోమ్ లోన్ EMIలు తక్షణమే పెరుగుతాయా?
పండుగ సీజన్లో చాలామంది వ్యక్తులు ప్రాపర్టీ కొనుగోలు నిర్ణయాలు తీసుకుంటారు. దీంతో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు త్వరగా రేట్లను పెంచితే కస్టమర్ల సెంటిమెంట్ దెబ్బతినవచ్చని లైవ్‌మింట్‌తో వ్యాఖ్యానించారు బేసిక్ హోమ్ లోన్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అతుల్ మోంగా. (ప్రతీకాత్మక చిత్రం)
కాబట్టి పండుగ సీజన్లో బ్యాంకులు హోమ్ లోన్ వడ్డీ రేట్లను మరీ ఎక్కువగా పెంచకపోవచ్చని విశ్లేషించారు. బ్రిగేడ్ గ్రూప్ CFO అతుల్ గోయల్ మాత్రం భిన్నంగా స్పందించారు. రియల్ ఎస్టేట్ రంగంపై రెపో రేటు పెంపు చాలా తక్కువ ప్రభావం చూపుతుందన్నారు. కార్పొరేట్ రుణాల వడ్డీ రేట్ల పెంపు స్వల్పంగా ఉండొచ్చని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)
రూపాయి క్షీణత, ద్రవ్యోల్బణ ఒత్తిడి నేపథ్యంలో RBI రెపో రేటును 50 bps పెంచిందని లైవ్‌మింట్‌తో చెప్పారు శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ MD & CEO రవి సుబ్రమణియన్. ‘హోమ్ లోన్ తీసుకున్న వారిపై ఈ ప్రభావం క్రమంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పాజిటివ్ మార్కెట్ సెంటిమెంట్ కారణంగా ప్రస్తుతం మార్కెట్ డిమాండ్ పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇది వడ్డీ రేటు పెంపు ప్రతికూల ప్రభావాన్ని అధిగమిస్తుందని అంచనా వేయవచ్చు. అయితే ఇక్కడి నుంచి కొనసాగే రేట్ల పెంపుదల కస్టమర్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తుంది’ అని రవి తెలిపారు. పాండమిక్ అనంతర దశలో ఆర్థిక వృద్ధి సాధ్యమైంది కానీ, వృద్ధి మళ్లీ మందగించే ప్రమాదాలు రాకుండా ద్రవ్య పరపతిని ఆర్బీఐ సమీక్షిస్తోందన్నారు. తాజా రేటు పెంపు ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు.