Home Loan: సొంతింటి కల సాకారం కావటం అంటే జీవితంలో అతిపెద్ద విషయాన్ని సాధించినట్టే అని మధ్యతరగతి వారంతా భావిస్తారు. సాధారణంగా సొంతిల్లు అనగానే సామాన్యులంతా హోమ్ లోన్ (Home loan) కోసం పరిగెత్తాల్సిందే. ఇక ఇల్లు కొన్నాక హోమ్ లోన్ (Home loan) అతి త్వరగా ఎలా తీర్చాలబ్బా అనే ఆలోచనలతోనే కొన్నేళ్లు గడిచిపోతాయి. మరి హోమ్ లోన్ (Home loan) త్వరగా తీర్చుకోలేమా? ఇందుకు ఏం చేయాలి? హోమ్ లోన్ నుంచి విముక్తి పొందే మార్గాలు అన్వేషించేవారు మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అందుకే ఇదెప్పుడూ ఇంటర్నెట్లో ట్రెండింగ్‌లో ఉంటుంది. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు, వడ్డీ రేట్లు (rate of interest) తగ్గించినప్పుడు హోమ్ లోన్ (Home loan) లోతుపాతులను పట్టుపట్టే సామాన్యులు కొన్ని చిట్కాలు పాటిస్తే ఆ రుణ భారాన్ని ఇట్టే తీర్చుకోవచ్చని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ సలహాలిస్తున్నారు. క్రమం తప్పకుండా సులభ వాయిదాలు చెల్లిస్తూనే మరోవైపు ఇంటి లోన్ తీర్చుకునే మార్గాలు చాలానే ఉన్నాయి. అవేంటో మీరే చదవండి. (ప్రతీకాత్మక చిత్రం)
దీర్ఘకాలిక రుణం: సాధారణంగా హోమ్ లోన్ (Home loan) అంటే అవి 15-20 ఏళ్ల పాటు చెల్లించాల్సిన కమిట్మెంట్ ఇవ్వాల్సిందే. మరి ఈ మధ్యకాలంలో మీరు ఎన్నో త్యాగాలు చేస్తూ, చిన్న చిన్న సరదాలను కూడా చంపుకుని, ఆ డబ్బును ఇంటి లోన్ కోసం కట్టి... ఈ వడ్డీలు కట్టే విధానానికి అతి త్వరగా స్వస్తిచెప్పాలని లెక్కలు వేస్తూనే ఉంటారు. ఇదంతా మంచిపనే కానీ మానసికంగా మీరు కుంగిపోయేంతలా ఇంటి లోన్ గురించి ఆలోచించకండి. ఇలా అన్ని సంతోషాలను త్యాగం చేస్తూ మీరు లోన్ కట్టినా హోం లోన్ (Home loan) అనేది నెలల్లో తీరేది మాత్రం కాదని గుర్తుంచుకోండి. పైపెచ్చు ఇలా మీ సరదాలు, సంతోషాలు, ట్రావెల్, గిఫ్ట్స్, సెలబ్రేషన్స్ (celebrations) వంటివి ఇంటి లోన్ తో ముడిపెట్టి అన్నీ త్యాగం చేయటం మొదట్లో చాలెంజింగ్ (challenges) గా అనిపించినా ఏడాది తరువాత మాత్రం మీకు ఇదంతా ఓ శిక్షలా అనిపిస్తుంది. కాబట్టి సిస్టమాటిక్‌గా ఆర్థిక నిపుణులు (financial experts) చెప్పినవి కొన్ని పాటిస్తే మీకు మానసికంగా క్షోభ తగ్గి, ఇంటి రుణ భారం నుంచి వీలైనంత త్వరగా విముక్తి పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
క్రమం తప్పకుండా EMIలు: EMI క్రమం తప్పకుండా చెల్లిస్తూనే అదనంగా మీకు చేతనైనంత మొత్తాన్ని ఎప్పటికప్పుడు చెల్లిస్తూ పోతే మీరు తీసుకున్న రుణ భారం తగ్గడం ఈజీగా సాధ్యమవుతుంది. దీంతో అసలు కాస్త తగ్గడమే కాకుండా ముఖ్యంగా వడ్డీ భారం మాత్రం చాలా వరకు తగ్గుతుంది. మీకు బోనస్ లు వంటి అదనపు ఆదాయం వచ్చినప్పుడు ఇలాంటి పేమెంట్స్ (payments) చేయటానికి ఉపయోగించండి. వీలైనంతగా ఎక్కువ ఈఎంఐ (EMI) లను చెల్లించేలా లోన్ ను ప్లాన్ చేసుకోండి. ఎక్కువ మొత్తాన్ని వాయిదాలుగా చెల్లిస్తే ఆటోమేటిక్ గా లోన్ తక్కువ టైంలోనే తీరుతుంది. కానీ ఇది ఎంతవరకు సాధ్యమో మీరు వ్యక్తిగతంగా లెక్కించుకోవాలి. మీ ఆదాయం, ఖర్చులు, పొదుపు, ఇతరత్రా అవసరాల కోసం చెల్లించాల్సిన మొత్తాలను పరిగణలోకి తీసుకుని ఈఎంఐ మొత్తం ఎక్కువ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. మీకు ఈ విషయంపై అవగాహన లేకపోతే బ్యాంక్ వారితో చర్చించండి. మీ హోం లోన్ (Home loan ) ఈఎంఐను ఈ నెల నుంచే పెంచుకోండి. అంతేకాదు వడ్డీని తగ్గించమని కూడా మీరు నెగోషియేట్ చేయవచ్చు. కానీ ఈ విధానాలు అన్నీ బ్యాంకుల్లో (banks) ఒకటేలా ఉండవు. (ప్రతీకాత్మక చిత్రం)
బదిలీ: ఒకవేళ మీరు హోం లోన్ (Home loan) తీసుకున్న బ్యాంకులో వడ్డీని (interest) తగ్గించేందుకు రెడీగా లేకపోతే ఇతర బ్యాంకులతో మీరు ప్రస్తుతం చెల్లిస్తున్న హోం లోన్ (Home loan ) వడ్డీని (interest) పోల్చి చూడండి. మీ బ్యాంకు ఎక్కువ వడ్డీ చార్జ్ చేస్తుంటే తక్షణం వేరే బ్యాంక్‌కు మీ హోం లోన్ (Home loan ) ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందుకు 2 వారాల పాటు సమయం పడుతుంది. కాస్త పేపర్ వర్క్ తో పాటు ప్రాసెసింగ్ ఫీ చెల్లించాల్సి వస్తుంది అంతే. ఇలా తక్కువ వడ్డీకే హోం లోన్ (Home loan ) ఇచ్చే బ్యాంకులకు బదిలీ చేసుకుంటే మీకు వడ్డీ (interest) భారం తడిసి మోపెడు కాకుండా త్వరగా అసలును తీర్చే వెసులుబాటు లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
వడ్డీ రేట్లు తగ్గినప్పుడు: రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు సవరించినప్పుడు హోమ్ లోన్ (Home loan) పై బ్యాంకు వడ్డీ రేటు బాగా తగ్గిందనుకోండి తక్షణం మీరు ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తే మీ హోం లోన్ (Home loan)లోని అసలు ఎక్కువ తీర్చే చాన్స్ దొరికినట్టే. మీ ఆదాయ వనరులు పెరిగేకొద్దీ, మీ జీతం పెరిగేకొద్దీ మీరు చెల్లించే ఈఎంఐ (EMI) ను తప్పకుండా పెంచుకోండి. దీంతో కనీసం 5-8 ఏళ్ల ముందే మీ హోం లోన్ (Home loan ) తీరడం ఖాయం. (ప్రతీకాత్మక చిత్రం)
SIP: సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్స్ (SIP)తో మీరు హోం లోన్ (Home loan ) అతి త్వరగా తీర్చుకునే చాన్స్ ఉంది. దీర్ఘకాలంపాటు మీరు అతి స్వల్ప మొత్తాన్ని సిప్ లో పొదుపు చేసినా అది పెద్ద మొత్తంగా మీ చేతికి వస్తుంది. ఇలా సిప్ లో ఇన్వెస్ట్ చేయడంతో మీకు కార్పస్ ఫండ్ కూడా వస్తుంది. ఇందులో కొంత మొత్తాన్ని హోం లోన్ (Home loan ) కోసం చెల్లించినా, మిగిలిన మొత్తాన్ని పొదుపు కింద మీరు భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా మీరు హోం లోన్ గా తీసుకున్న మొత్తంలో కేవలం 0.10శాతాన్ని సిప్ లో ఇన్వెస్ట్ చేయండి. అంటే మీరు 70 లక్షల రూపాయల హోం లోన్ (Home loan) తీసుకున్నట్టైతే ఇందులో 0.10 శాతం అంటే నెలకు కేవలం 7వేల రూపాయలు సిప్ లో ఇన్వెస్ట్ చేస్తే 20 ఏళ్లపాటు ఇలా చేస్తే వడ్డీతో సహా మీకు భారీ మొత్తం చేతికి అందుతుంది. (ప్రతీకాత్మక చిత్రం) (Disclaimer: The material provided on this page is for information purposes only. Any opinion that may be provided on this page does not constitute a recommendation by telugu.news18.com. We do not make any representations or warranty on the accuracy or completeness of the information that is provided on this page. If you rely on the information on this page then you do so entirely on your own risk.)