1. పండుగ సీజన్ సమీపిస్తుండటంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీ ఆఫర్లు ప్రకటించింది. రుణ మొత్తంతో సంబంధం లేకుండా అన్ని గృహ రుణ వడ్డీ రేట్లను 6.7 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ స్కోరు ఆధారంగా కస్టమర్లు ఈ వడ్డీ రేటును పొందవచ్చని తెలిపింది. అంతేకాదు, ఈ ఆఫర్ కింద ప్రాసెసింగ్ ఫీజు కూడా మినహాయించినట్లు పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ ఆఫర్ వల్ల 45 బేసిస్ పాయింట్ల వడ్డీ ఆదాతో పరోక్షంగా రూ.8 లక్షల వరకు భారీగా వడ్డీని రుణగ్రహీతలు ఆదా చేసుకోవచ్చని వివరించింది. అయితే, గతంలో వేతన జీవుల హోమ్‌లోన్ తీసుకుంటే 15 బేసిస్ పాయింట్ల మేర అధిక వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అంతరాన్ని ఎస్బీఐ తొలగించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. వడ్డీ రేట్ల తగ్గింపుపై ఎస్బిఐ మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) సిఎస్ శెట్టి మాట్లాడుతూ "మా గృహ రుణ వినియోగదారులకు పండుగ ఆఫర్లు ప్రకటించినందుకు సంతోషంగా ఉంది. సాధారణంగా వడ్డీ రాయితీ అనేది వేతన జీవులకు మాత్రమే ఇస్తుంటారు. అది కూడా నిర్థిష్ట లోన్ పరిమితి వరకే ఇస్తారు. అయితే ఈసారి భిన్నంగా అందరికీ వడ్డీ రాయితీ ఇవ్వాలని నిర్ణయించాం. రుణ మొత్తం, రుణగ్రహీత వృత్తితో సంబంధం లేకుండా 6.7 శాతం వడ్డీకే రుణాలు మంజూరు చేస్తాం” అని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. మరోవైపు పండుగ సీజన్ ముందు గృహ కొనుగోలుదారులను ప్రోత్సహించడానికి, ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు కూడా ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గృహరుణాలను బదిలీ చేసుకునే వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించారు. అయితే, ఈ పండుగ ఆఫర్లు ఎప్పటివరకు ఉంటాయనే దానిపై ఎస్బీఐ స్పష్టతనివ్వలేదు. (ప్రతీకాత్మక చిత్రం)