ఈ పరిస్థితులన్నింటినీ లెక్కలోకి తీసుకుంటే... ఇండియాలో స్వీట్ కార్న్ పండించే రైతులకు హెక్టారుకు రూ.2,50,000 నుంచి రూ.5,00,000 లాభం వస్తోంది. ఎక్కువ లాభాలు రావాలంటే.. సరైన వ్యవసాయ పద్ధతులు పాటించాలి. సరైన మార్కెటింగ్ వ్యూహాలను అమలు చెయ్యాలి. ఇందుకోసం వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవాలి.
స్వీట్ కార్న్ సాగు చేపట్టాలి అనుకునేవారు.. ముందుగా తమ ఏరియాలో స్వీట్ కార్న్ డిమాండ్ ఎలా ఉండో ఆరా తీసుకోవాలి. పొడి వాతావరణంలోనే స్వీట్ కార్న్ పెరుగుతుంది. ఎండ బాగా అవసరం. అలాంటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. స్వీట్ కార్న్లలో చాలా రకాలున్నాయి. మీ ఏరియాలో ఏది బాగా పండగలదో శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకోవాలి.