ఇండియన్ టూవీలర్ మార్కెట్లో మెజార్టీ షేర్‌తో దూసుకుపోతున్న హీరో మోటోకార్ప్ కంపెనీ (Hero MotoCorp).. ఎప్పటికప్పుడు కొత్త మోడల్ బైక్స్ రిలీజ్ చేస్తోంది. వివిధ రకాల అవసరాలకు తగ్గట్టు బడ్జెట్, లగ్జరీ, స్పోర్ట్స్ బైక్స్ రూపొందించే ఈ సంస్థ.. తాజాగా సరికొత్త సూపర్ స్ప్లెండర్ XTEC మోడల్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ వెహికల్ BS6 కంప్లైంట్ 125cc ఇంజిన్‌తో వస్తుంది. దీని ధర, ప్రత్యేకతలు తెలుసుకుందాం.
* ఇంజిన్, డిజైన్ : హీరో సూపర్ స్ప్లెండర్ XTEC 125cc పెట్రోల్ ఇంజన్‌తో రన్ అవుతుంది. ఇది 7,500 rpm వద్ద 10.7 bhp పవర్‌ను, 6,000 rpm వద్ద 10.6 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ బైక్ 68 kmpl మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. సరికొత్త హీరో సూపర్ స్ప్లెండర్ XTEC బైక్, హై ఇంటెన్సిటీ పొజిషన్ ల్యాంప్ ఉండే LED హెడ్‌ల్యాంప్‌తో వస్తుంది. విజర్, రిమ్ టేప్స్ కొత్త మోడల్లో కనిపిస్తున్నాయి. డ్యూయల్ టోన్ స్ట్రిప్స్ మొత్తం స్టైలింగ్‌ను అప్డేట్ చేసినట్లు చెప్పవచ్చు.
* స్పెసిఫికేషన్లు : సూపర్ స్ప్లెండర్ XTEC బైక్ బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. దీని ద్వారా కాల్, SMS అలర్ట్స్, ఫోన్ బ్యాటరీ లెవల్ ఇండికేటర్ అలర్ట్స్ తెలుసుకోవచ్చు. డిజిటల్ స్పీడోమీటర్, ఫ్యూయల్ ఇండికేటర్, ఇంటిగ్రేటెడ్ USB ఛార్జర్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్, రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్ (RTMI) వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సూపర్ స్ప్లెండర్ XTECలో ఐకానిక్ హీరో i3S (ఐడిల్ స్టాప్ - స్టార్ట్ సిస్టమ్) ఉంది.