1. ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్ అయిన హీరో ఎలక్ట్రిక్ (Hero Electric) ఇండియాలో మరో ఎలక్ట్రిక్ టూవీలర్‌ను (Electric Two Wheeler) లాంఛ్ చేసింది. హీరో ఎడ్డీ (Hero Eddy) పేరుతో లేటెస్ట్ మోడల్‌ను పరిచయం చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) ఎక్స్ షోరూమ్ ధర కేవలం రూ.72,000 మాత్రమే. (image: Hero Electric)
2. స్టైలిష్ డిజైన్, ఆకట్టుకునే ఫీచర్స్‌తో హీరో ఎడ్డీ ఆకట్టుకుంటుంది. పట్టణాల్లో ఉండేవాళ్లు చిన్నచిన్న అవసరాలకు, దగ్గర్లోని ప్రాంతాలకు వెళ్లేందుకు హీరో ఎడ్డీ ఎలక్ట్రిక్ టూవీలర్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ టూవీలర్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కంపెనీలు పోటాపోటీగా ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లను రిలీజ్ చేస్తున్నాయి. (image: Hero Electric)
3. ఇప్పటికే పలు మోడల్స్ రిలీజ్ చేసిన హీరో ఎలక్ట్రిక్ ఇప్పుడు హీరో ఎడ్డీ మోడల్‌ను పరిచయం చేసింది. హీరో ఎడ్డీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ చూస్తే ఇందులో ఇ-లాక్, ఫైండ్ మై బైక్, రివర్స్ మోడ్, లార్జ్ బూట్ స్పేస్, ఫాలోమీ హెడ్‌ల్యాంప్స్ లాంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఈ టూవీలర్స్ నడిపేవారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణాన్ని కొనసాగించ్చని కంపెనీ చెబుతోంది. (image: Hero Electric)
4. హీరో ఎడ్డీ ఎలక్ట్రిక్ స్కూటర్ లైట్ బ్లూ, ఎల్లో కలర్స్‌లో రిలీజైంది. హీరో ఎలక్ట్రిక్ షోరూమ్స్‌లో బుక్ చేయొచ్చు. ఈ బైక్ నడపడానికి డ్రైవింగ్ సైలెన్స్, రిజిస్ట్రేషన్ ప్లేట్, హెల్మెట్ అవసరం లేదు. హీరో ఎడ్డీ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 85కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. (image: Hero Electric)
5. హీరో ఎడ్డీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఇందులో 51.2V బ్యాటరీ కెపాసిటీ ఉంది. హీరో ఎలక్ట్రిక్ బ్రాండ్ టూవీలర్ మార్కెట్లో వాటా పెంచుకోవడానికి కృషి చేస్తోంది. ఇప్పటికే లుధియానా ప్లాంట్‌లో ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుతున్నట్టు ప్రకటించింది. (image: Hero Electric)