దీంతో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీలు ఆకర్షణీయంగా మారాయి. హెచ్డీఎఫ్సీ, పీఎన్బీ, ఐసీఐసీఐ బ్యాంక్‌లతో సహా పలు బ్యాంకులు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లతో పాటు ఇతర రుణాలపై వడ్డీ రేట్లను పెంచాయి. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, పీఎన్బీ బ్యాంకులు రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై ప్రస్తుతం(జనవరి 24) అందిస్తున్న వడ్డీ రేట్లను ఇప్పుడు పరిశీలిద్దాం.
* 46 -60 రోజుల టెన్యూర్‌పై వడ్డీ రేట్లు : 7 రోజుల నుంచి 14 రోజుల కాలవ్యవధి ఎఫ్డీలపై సాధారణ ప్రజలకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. పీఎన్బీ 3.5 శాతం, ఐసీఐసీఐసీ 3 శాతం వడ్డీని అందిస్తోంది. 15- 29 రోజుల ఎఫ్డీలపై సాధారణ ప్రజలకు హెచ్డీఎఫ్సీ 3 శాతం, పీఎన్బీ 3.50 శాతం, ఐసీఐసీఐ 3 శాతం వడ్డీని ఇస్తున్నాయి.
30- 45 రోజుల ఎఫ్డీలపై సాధారణ ప్రజలకు హెచ్ డీఎఫ్సీ, పీఎన్బీ, ఐసీఐసీఐ 3.50 శాతం వడ్డీని అందిస్తున్నాయి. 46- 60 రోజుల ఎఫ్డీలపై సాధారణ ప్రజలకు హెచ్డీఎఫ్సీ, పీఎన్బీ 4.50 శాతం, ఐసీఐసీఐ 4 శాతం వడ్డీని చెల్లిస్తున్నాయి. 61- 89 రోజుల కాలవ్యవధి ఎఫ్డీలపై ఈ మూడు బ్యాంక్‌లు 4.50 శాతం వడ్డీని అందిస్తున్నాయి.
30- 45 రోజుల ఎఫ్డీలపై సాధారణ ప్రజలకు హెచ్ డీఎఫ్సీ, పీఎన్బీ, ఐసీఐసీఐ 3.50 శాతం వడ్డీని అందిస్తున్నాయి. 46- 60 రోజుల ఎఫ్డీలపై సాధారణ ప్రజలకు హెచ్డీఎఫ్సీ, పీఎన్బీ 4.50 శాతం, ఐసీఐసీఐ 4 శాతం వడ్డీని చెల్లిస్తున్నాయి. 61- 89 రోజుల కాలవ్యవధి ఎఫ్డీలపై ఈ మూడు బ్యాంక్‌లు 4.50 శాతం వడ్డీని అందిస్తున్నాయి.
* 18 నెలలు- 2 రెండేళ్ల టెన్యూర్‌పై వడ్డీరేట్లు : 15 నెలల నుంచి 18 నెలలలోపు ఎఫ్డీలపై సాధారణ ప్రజలకు హెచ్డీఎఫ్సీ 7 శాతం, పీఎన్బీ 666 రోజుల ఎఫ్డీపై 7.25 శాతం, ఐసీఐసీఐ 15 నెలల నుంచి 18 నెలలలోపు వాటిపై 7 శాతం వడ్డీని అందిస్తున్నాయి. 1 8నెలల ఒకరోజు నుంచి 2 ఏళ్ల ఎఫ్డీలపై హెచ్డీఎఫ్సీ 7 శాతం, పీఎన్బీ 667 రోజుల నుంచి 2 ఏళ్ల ఎఫ్డీలపై 6.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఐసీఐసీఐ 18 నెలల నుంచి రెండేళ్లవాటిపై 7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
* 5- 10 ఏళ్ల కాలపరిమితిపై వడ్డీ : రెండేళ్ల ఒక రోజు నుంచి మూడేళ్ల వాటిపై సాధారణ ప్రజలకు హెచ్ డీఎఫ్సీ 7 శాతం, పీఎన్బీ 6.75, ఐసీఐసీఐ 7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. మూడేళ్ల ఒక రోజు నుంచి ఐదేళ్ల వాటిపై హెచ్డీఎఫ్సీ 7 శాతం, పీఎన్బీ 6.50 శాతం, ఐసీఐసీఐ 7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఐదేళ్ల ఒక రోజు నుంచి 10 ఏళ్ల ఎఫ్డీలపై హెచ్డీఎఫ్సీ 7 శాతం, పీఎన్బీ 6.50 శాతం, ఐసీఐసీఐ 6.90 వడ్డీని చెల్లిస్తున్నాయి. ఈ మూడు బ్యాంకులు కనిష్టంగా 7 రోజుల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల కాలపరిమితి ఉన్న వివిధ ఎఫ్డీలపై సాధారణ ప్రజలతో పోల్చితే సీనియర్ సిటిజన్స్‌కు అదనంగా 0.50 వడ్డీ రేట్‌ను ఆఫర్ చేస్తున్నాయి.