కరోనా విపత్కర పరిస్థితుల నుంచి భారతీయ కార్ల మార్కెట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. వివిధ కంపెనీల నుంచి ఇప్పటికే కొన్ని మోడల్స్ లాంచ్ కాగా, ఈ ఏడాదిలో మరికొన్ని కార్లు భారతీయ మార్కెట్లలో అడుగుపెట్టనున్నాయి. ప్రధానంగా హై-ఎండ్ ఎస్యూవీ, ఈవీ సెగ్మెంట్లలలో కొత్త మోడల్స్ రానున్నాయి. మరి అప్‌కమింగ్ కార్ల స్పెసిఫికేషన్స్, ధరల వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
* కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ : కియా సెల్టోస్-2023లో ప్రధానంగా ఇంటీరియర్ డిజైన్‌లో మార్పులు చేశారు. తాజా అప్డేట్స్తో ఇది స్పైసియర్-లుకింగ్ SUVగా కనబడుతుంది. ఈ అప్డేటెడ్ SUVలో 10.25-ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త ఇంటీరియర్ ఎలిమెంట్స్ వంటి కొత్త ఫీచర్స్ ఉంటాయి. పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రానిక్ టెయిల్‌గేట్, ఆటో-హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఇతర ఫీచర్స్ దీని ప్రత్యేకతలుగా ఉన్నాయి. దీని ధర ప్రారంభ ధర రూ.10 లక్షలుగా ఉండవచ్చు. ఇది మేలో లాంచ్ కావచ్చు.
* ఎంజీ కామెట్ : ఎంజీ మోటార్స్ నుంచి ఈవీ సెగ్మెంట్లో రానున్న రెండో కారు ఇది. ఈ టూ-డోర్స్ స్మార్ట్ అర్బన్ ఎలక్ట్రిక్ సిటీ కారు 25-kWh బ్యాటరీ, 50 kW మోటారుతో పవర్‌ను పొందుతుంది. దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 150-200 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. కారు లోపలి భాగంలో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ సెంటర్ కోసం డ్యూయల్ 10.25-అంగుళాల డిజిటల్ డిస్ప్లే ఉంటుంది. ఎంజీ కామెట్ ఏప్రిల్ 20లోపు లాంచ్ కావచ్చు. దీని ధర రూ. రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.
* టాటా ఆల్ట్రోజ్ ఈవీ : టాటా మోటార్స్ 2019లో జరిగిన జెనీవా మోటార్ షోలో ఆల్-ఎలక్ట్రిక్ ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అప్‌కమింగ్ టాటా ఆల్ట్రోజ్ EV కూడా అదే ఆల్ఫా ప్లాట్‌ఫారమ్ నుంచి వచ్చే అవకాశం ఉంది. టాటా నెక్సాన్ ఈవీ మాదిరి ఇందులోనూ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్, PDU (పవర్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్)వంటి ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది. ఇందులో 26 kWh బ్యాటరీ ఉండవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే ఇది 306 కిమీ రేంజ్‌ను అందించే అవకాశం ఉంది. దీని ధర రూ.12 లక్షల నుంచి ప్రారంభం కావచ్చు. టాటా ఆల్ట్రోజ్ ఈవీ లాంచ్ తేదీపై ఇంకా స్పష్టత లేదు.
* మారుతి సుజుకి ఫ్రాంక్స్ : కాంపాక్ట్ SUVగా మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఈ నెలలోనే లాంచ్ కావచ్చు. దీని ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) సుమారు రూ.8 లక్షలుగా ఉండవచ్చు. ఈ కారు తొమ్మిది కలర్ ఆప్షన్లతో ఐదు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఇందులో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. దీని కెపాసిటీ 998.0 నుంచి 1197.0 ccగా ఉంటుంది.
* హ్యుందాయ్ క్రెటా : హ్యుందాయ్ క్రెటా మొదటిసారిగా 2020లో భారత మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ మోడల్లో సెకండ్ జనరేషన్ ఎడిషన్ వివిధ అప్డేట్లతో రానుంది. ఈ ఎస్యూవీ వాస్తవానికి పూర్తిగా కొత్త-తరం మోడల్ కాదు. కొన్ని ముఖ్యమైన అప్ డేట్లతో మాత్రమే రానుంది. హ్యుందాయ్ క్రెటా-2023 రీడిజైన్ విషయంలో టక్సన్ నుంచి ప్రేరణ పొందింది. ADAS, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడిన కొత్త ఫీచర్స్ ఇందులో ఉంటాయి. ఈ అప్డేట్ కారులో 1.5L టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ కారు ప్రారంభ ధర రూ.10 లక్షలు ఉండవచ్చు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ కావచ్చు.