పెట్టుబడి ఆప్షన్స్‌లో భారతీయులు ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్స్ (Fixed Deposits)కు ప్రాధాన్యం ఇస్తారు. తక్కువ రిస్క్‌తో పాటు రిటర్న్స్‌కు గ్యారెంటీ ఉండడమే అందుకు కారణం. పైగా సౌకర్యవంతమైన కాలపరిమితితో పాటు పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి. సీనియర్ సిటిజన్స్‌కు సాధారణ పబ్లిక్‌తో పోల్చితే ఎఫ్డీలపై అధికంగా వడ్డీ రేటును బ్యాంకులు అందిస్తున్నాయి.
* కెనరా బ్యాంక్ : ఈ బ్యాంక్ ఐదేళ్ల కాలపరిమితితో కూడిన కాలబుల్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్స్‌కు 7 శాతం వడ్డీని అందిస్తుంది. మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితి ఎఫ్డీలపై కూడా 7 శాతం వడ్డీని కెనరా బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. రూ.15 లక్షల నుంచి రూ.2 కోట్లలోపు నాన్-కాలబుల్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్స్‌కు 7.45% వడ్డీ లభించనుంది.
* పంజాబ్ నేషనల్ బ్యాంక్ : ఇటీవల పీఎన్బీ ఎంపిక చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ల కాలపరిమితులపై వడ్డీ రేట్లను 30 బేసిస్ పాయింట్ల (bps) వరకు పెంచింది. దీంతో ఐదేళ్ల ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్స్‌కు 7% వడ్డీని తాజాగా ఆఫర్ చేస్తోంది. ఇక, ఐదేళ్ల నుంచి పదేళ్ల కాలపరిమితి ఎఫ్డీలపై 7.3% వడ్డీని అందిస్తోంది. సాధారణ ప్రజలకు మూడు నుంచి పదేళ్ల కాలపరిమితి ఎఫ్డీలపై తాజాగా 6.50% వడ్డీని ఆఫర్ చేస్తోంది. కాగా, కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి వచ్చినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెల్లడించింది.
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : ఈ ప్రభుత్వరంగ బ్యాంకు ఐదేళ్ల నుంచి పదేళ్ల కాలపరిమితి ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్స్‌కు 7.5 వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇదే టెన్యూర్‌పై సాధారణ ప్రజలకు కేవలం 6.50 శాతం వడ్డీని మాత్రమే అందిస్తుంది. అంటే సీనియర్ సిటీజన్స్‌కు అదనంగా ఒక శాతం వడ్డీని ఎస్బీఐ అందిస్తోంది. తాజా వడ్డీ రేట్లు ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఎస్బీఐ వెల్లడించింది. దిగ్గజ ప్రభుత్వరంగ బ్యాంకు సీనియర్ సిటిజన్స్ కోసం తాజాగా కొత్త ఎఫ్డీ పథకాన్ని కూడా ప్రకటించింది. ఎస్బీఐ అమృత కలాష్ పేరుతో కొత్త కాలపరిమితి డిపాజిట్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. 400 రోజుల కాలపరిమితితో కూడిన ఈ డిపాజిట్ ద్వారా సీనియర్ సిటిజన్స్ 7.6 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఈ పథకంలో చేరడానికి ఫిబ్రవరి 15 నుంచి మార్చి 31 వరకు ఎస్బీఐ అవకాశం కల్పించింది.