ఈ ఏడాది వేసవికాలం ప్రారంభమవుతోంది. ఎండ తీవ్రత క్రమంగా పెరిగిపోతుంది. రానున్న రోజుల్లో భానుడి ప్రతాపం మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. వేసవిలో వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది ఏసీ(ఎయిర్ కండిషనర్)లను కొనుగోలు చేస్తుంటారు. అయితే వేసవికి ముందే ప్రముఖ టెక్ బ్రాండ్ డైకిన్ (Daikin) అడ్వాన్స్డ్ ఫీచర్స్‌తో వివిధ రకాల ఏసీలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కంపెనీ అందిస్తున్న బెస్ట్ ఏసీలు ఏవి, వాటి ధర, స్పెసిఫికేషన్స్ వంటి వివరాలు పరిశీలిద్దాం.
* డైకిన్ 1.5 టన్స్ 3-స్టార్ ఫిక్స్డ్ స్పీడ్ స్ప్లిట్ ఏసీ (మోడల్- FTL50U) : మీడియం సైజ్ గదికి ఈ 3-స్టార్ ఏసీ బాగా సెట్ అవుతుంది. బెస్ట్ ఫీచర్స్‌తో వస్తున్న ఈ ప్రొడక్ట్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.40,400కు అందుబాటులో ఉంది. ఇందులో కాపర్ కండెన్సర్ కాయిల్ ఉంటుంది. ఇది గదిలో కూలింగ్‌ను మరింత మెరుగుపరుస్తుంది. దీంట్లో ఉండే పవర్ ఎయిర్‌ఫ్లో డ్యూయల్ ఫ్లాప్ కారణంగా కూలింగ్ ఏకరీతిగా ఉంటుంది. ఇందులో ఉండే ప్రత్యేకమైన డ్రై మోడ్ ఫంక్షన్ వర్షాకాలంలో ఆటోమేటిక్‌గా గాలిలో ఉండే అధిక తేమను తగ్గిస్తుంది. వోల్టేజ్ 230 వోల్ట్స్, వాటేజ్ 1278 వాట్స్, నాయిస్ లెవల్ 38 డెసిబుల్స్ ఈ ఏసీ స్సెసిఫికేషన్స్.
* డైకిన్ 1 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ : ఈ 5 -స్టార్ ఏసీ అమెజాన్‌లో ప్రస్తుతం రూ.39,850కు అందుబాటులో ఉంది. ఇందులో ప్రత్యేక ఫీచర్స్‌గా ట్రిపుల్ డిస్ప్లే ఉంటుంది. ఇది విద్యుత్ వినియోగం శాతంతో పాటు సెట్ గది ఉష్ణోగ్రత, ఆటో ఎర్రర్ కోడ్‌ను డిస్ప్లే చేస్తుంది. ఈ ఏసీ డ్యూ-క్లీన్ టెక్నాలజీతో వస్తుంది. దీంతో ఇది గాలిని ఫ్రెష్‌గా ఉంచుతుంది. ఆటోమేటిక్ మాయిశ్చర్, డస్ట్ ఫిల్టర్, డీహ్యుమిడిఫైయర్, ఫాస్ట్ కూలింగ్ సిస్టమ్చ కాఫర్ కండెన్సర్ కాయిల్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. వాటేజ్ 940 వాట్స్, వార్షిక ఎనర్జీ కన్జమ్షన్ 523.54-కిలోవాట్ అవర్స్, నాయిస్ లెవల్ 30 డెసిబుల్స్ వంటివి ఈ ఏసీ ప్రత్యేకతలు.
* డైకిన్ 1.5 టన్స్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ : ఇది 5-స్టార్ రేటింగ్‌తో లభిస్తున్న అడ్వాన్స్డ్ మోడల్. దీనికి విద్యుత్ వినియోగం ఎక్కువ అవసరం ఉండదు. అమెజాన్‌లో ప్రస్తుతం ఇది రూ.49,200కు అందుబాటులో ఉంది. ఈ ఏసీలో కాపర్ కండెన్సర్ కాయిల్ ఉంటుంది. తద్వారా బెటర్ కూలింగ్‌ను గది మొత్తానికి అందిస్తుంది. ఈ డైకిన్ AC 43 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా మెరుగైన కూలింగ్ సామర్థ్యంతో పనిచేస్తుంది. గాలిని శుద్ధి చేసే డ్యూ క్లీన్ టెక్నాలజీ, ట్రిపుల్ డిస్ప్లే, 5.2 హై ISEER, PM 2.5 ఫిల్టర్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. వోల్టేజ్ 230 వోల్ట్స్,1325 వాట్స్ దీని స్పెసిఫికేషన్స్.
* డైకిన్ 1 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ : తక్కువ ధరలో ఏసీ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. అమెజాన్‌లో ప్రస్తుతం ఇది రూ.37,990కు లభిస్తోంది. ఇందులో ఇన్వర్టర్ స్వింగ్ కంప్రెసర్ డ్యూ క్లీన్ టెక్నాలజీతో ఉంటుంది. దీంతో ఇది ఫ్రెష్ ఎయిర్‌ను అందిస్తుంది. చిన్న రూమ్‌లకు ఈ ఏసీ కంఫర్ట్‌గా ఉంటుంది. 52 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా చల్లని గాలిని అందిస్తుంది. ఈ ఏసీలో నియో స్వింగ్ కంప్రెసర్ ఉంటుంది. దీంతో తక్కువ రాపిడితో రిఫ్రిజిరెంట్ గ్యాస్ లీక్ కాకుండా నిరోధిస్తుంది. వోల్టేజ్ 230 వోల్ట్స్, వాట్స్ 680.4 కిలోవాట్ అవర్స్ దీని ప్రత్యేకతలు.
* డైకిన్ 1.8 టన్స్ 5-స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ : గాలిని తాజాగా అందించడంలో ఇది ఉత్తమంగా పనిచేస్తుంది. అమెజాన్‌లో ప్రస్తుతం ఇది రూ.69,145కు లభిస్తోంది. ఇందుకోసం హై ISEER (5.2), డ్యూ క్లీన్ టెక్నాలజీతో కూడిన ఇన్వర్టర్ స్వింగ్ కంప్రెసర్‌ను ఇందులో అమర్చారు. భారీ సైజ్ రూమ్ లకు ఈ ఏసీ బాగా సెట్ అవుతుంది. ఈ ఏసీలో PM 1.0 ఫిల్టర్ ఉంటుంది. ఎకోనో మోడ్‌లో పనిచేయడం కారణంగా ఇది తక్కువ విద్యుత్‌తో నడుస్తుంది. ఈ ఏసీకి మరో ప్రత్యేకత ఉంది. ఏదైనా సమస్య ఉంటే ఆటోమెటిక్‌గా గుర్తించి IDU డిస్ప్లేలో ప్రదర్శిస్తుంది. సంవత్సరానికి విద్యుత్ వినియోగం అనేది 923.07-కిలోవాట్ అవర్ ఫర్ ఇయర్‌గా ఉంది.