టెక్నాలజీ అభివృద్ధితో చాలా రంగాల్లో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అన్నింటికంటే వేగంగా ఈ మార్పులు బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకున్నాయి. ఇప్పుడు దాదాపు అన్ని బ్యాంకులు ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ల ద్వారా సేవలు అందిస్తున్నాయి. అయితే ఇంటర్నెట్ లేకుండా కేవలం మిస్డ్‌కాల్ లేదా మెసేజ్‌ల ద్వారా కూడా బ్యాంకింగ్ సేవలు పొందే అవకాశం కల్పిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).
ఇప్పుడు కస్టమర్లకు ఎస్బీఐ క్విక్ యాప్ ద్వారా అనేక మొబైల్ సేవలను ఉచితంగా అందిస్తోంది. మిస్డ్ కాల్ బ్యాంకింగ్ సాయంతో అకౌంట్ బ్యాలెన్స్, మినీ-స్టేట్మెంట్ పొందవచ్చు. లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి నిర్దిష్ట మొబైల్ నంబర్లకు ప్రీడిఫైన్డ్ కీవర్డ్స్ ఉపయోగించి SMS పంపించి కూడా వివిధ సేవలను పొందవచ్చు.ఎస్బీఐ కస్టమర్లు ఫోన్లో ఉచితంగా పొందగలిగే 10 సేవలపై ఓ లుక్కేయండి.
ఎస్బీఐ క్విక్ సర్వీస్ కోసం యూజర్లు సైన్ అప్ చేయాల్సి ఉంటుందని ఎస్బీఐ తెలిపింది. ఈ సేవలకు కచ్చితంగా అకౌంట్‌కు లింక్ అయిన ఫోన్ నంబర్‌నే వినియోగించాలి. ఆండ్రాయిడ్, విండోస్, iOS లేదా బ్లాక్‌బెర్రీ ఫోన్‌ని కలిగి ఉంటే సంబంధిత యాప్ స్టోర్ నుంచి ఎస్బీఐ క్విక్ యాప్‌ను పొందవచ్చు. ఎస్బీఐ క్విక్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఉపయోగించవచ్చు.