పసిడి ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. తులం బంగారం ధర ఇప్పటికే 50 వేల మార్క్‌ను దాటిపోగా బుధవారం కూడా అదే దూకుడును కొనసాగించింది. తాజాగా బుధవారం నాడు కూడా బంగారం ధర 430 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర నేడు రూ.50,350గా ఉంది. 50 వేలకు వెళ్లడమే షాకింగ్ అంటే.. అంతకంటే మరో 350 రూపాయలు పైకి ఎగబాకడం కొనుగోలుదారులకు మింగుడు పడని విషయంగా మారింది.
పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం విక్రయాలు జోరుగా సాగుతున్న ఈ తరుణంలో పసిడి ధరలు ఇలా పైపైకి వెళుతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,150 పలుకుతోంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా పసిడి ధర 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,150గా ఉంది.
కోల్‌కత్తాలో బంగారం ధర రాకెట్లా దూసుకెళుతోంది. 50 వేల మార్క్‌ను దాటడమే కాదు 51 వేల కంటే ఎక్కువ పలుకుతుండటం గమనార్హం. కోల్‌కత్తాలో 24 క్యారెట్ల బంగారం ధర 51,450 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,750గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,730కి చేరింది.
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,670కి చేరుకుందంటే అక్కడ పసిడికి ఏ రేంజ్లో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,300గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,730కి చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,500గా ఉంది.
ఇదిలా ఉంటే.. బంగారం ధరలు ఈ వారం దాదాపు పెరగడమే కానీ తగ్గే అవకాశాలు ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బంగారం, వెండి ధరలు ప్రతి రోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.