Amazon Pay: అమెజాన్ పే బ్యాలెన్స్‌ను బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఎలా? ఇలా చేయండి!
Amazon Pay: అమెజాన్ పే బ్యాలెన్స్‌ను బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఎలా? ఇలా చేయండి!
Amazon Pay Balance Bank Account Transfer | మీరు అమెజాన్ పే బ్యాలెన్స్‌ను బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ పని ఎలా పూర్తి చేయాలో తెలుసుకోండి.
Bank Account | అమెజాన్ గిఫ్ట్ కార్డ్ వచ్చిందా? దీన్ని రిడీమ్ చేసుకున్నారా? అయితే మీకు అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో ఈ డబ్బులు కనిపిస్తూ ఉంటాయి. ఈ డబ్బుతో మీరు అమెజాన్‌లో షాపింగ్ చేయొచ్చు. లేదంటే అమెజాన్ పే ద్వారా యుటిలిటీ బిల్లులు చెల్లించొచ్చు.
2/ 9
అయితే మీకు మరో ఆప్షన్ కూడా ఉంది. అదే బ్యాంక్ అకౌంట్‌కు కూడా మీరు అమెజాన్ పే బ్యాలెన్స్‌ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అయితే దీని కోసం మీరు మీ ఫుల్ కేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి. అమెజాన్ కేవైసీ వెరిఫికేషన్ అనేవి ఉచితమే. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పని లేదు.
3/ 9
అమెజాన్ యాప్‌లోకి వెళ్లాలి. అక్కడ మేనేజ్ ఆప్షన్లో కేవైసీ అనే దానిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు సెల్ఫీ తీసుకొని ఫోటో అప్లోడ్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి.
4/ 9
ఆధార్ కార్డు వెరిఫై చేసుకోవాలి. అలాగే వీడియో కాల్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి. అమెజాన్ ఏజెంట్ మీకు కాల్ చేస్తారు. కేవైసీ పూర్తి అయిన తర్వాత మీరు అమెజాన్ పే బ్యాలెన్స్‌ను బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
5/ 9
ఇప్పుడు మీరు మీ ఫోన్లోని అమెజాన్ యాప్‌లోకి వెళ్లాలి. అమెజాన్ పే సెక్షన్లోకి వెళ్లాలి. తర్వాత సెండ్ మనీ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత బ్యాంక్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
6/ 9
మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత పే నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత మీరు ఎంత డబ్బు పంపాలని అనుకుంటున్నారో ఎంటర్ చేసేయాలి. కంటిన్యూపై క్లిక్ చేయాలి.
7/ 9
ఇప్పుడు మీకు పేమెంట్ మెథడ్ ఆప్షన్ కనిపిస్తుంది. తర్వాత షో మోర్ అనే దానిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు అమెజాన్ పే బ్యాలెన్స్‌ను ఎంచుకోవాలి. తర్వాత కంటిన్యూపై క్లిక్ చేయాలి. ఇప్పుడు డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ అవుతాయి.
8/ 9
అమెజాన్ పే అనేది ఇవాలెట్ సర్వీస్. ఈకామర్స్ దిగ్గజమైన అమెజాన్ ఈ సేవలు అందిస్తోంది. ఇతర ఇవాలెట్స్ మాదిరిగానే అమెజాన్ పే కూడా డబ్బులు పంపడం, స్వీకరించడం వంటి సేవలు అందిస్తుంది. యూపీఐ ద్వారా ఇది పని చేస్తుంది.
9/ 9
అమెజాన్ పే ద్వారా బస్ టికెట్లు బుక్ చేయొచ్చు, మూవీ టికెట్లు రిజర్వు చేసుకోవచ్చు, కరెంట్ బిల్లు చెల్లించొచ్చు. గ్యాస్ బుక్ చేయొచ్చు. మనీ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ ఉంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు. ఇలా అమెజాన్ పే ద్వారా పలు రకాల సేవలు పొందొచ్చు.