Electric Scooter | మీరు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఇంట్లో ఉన్న పాత స్కూటర్‌ను ఇచ్చేసి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే బెటరని ఆలోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది.
2/ 8
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఓలాఎలక్ట్రిక్ అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంచింది. మీరు మీ ఇంట్లో ఉన్న పాత పెట్రోల్ స్కూటర్‌ను ఇచ్చేసి కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయొచ్చు. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ ఎలా పని చేస్తుందో ఒకసారి తెలుసుకుందాం.
3/ 8
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తే 0.17 పైసలులో ఒక కిలోమీటర్లు దూరం వెళ్లొచ్చు. అదే పెట్రోల్ వెహికల్ అయితే చాలా ఎక్కువగా ఖర్చు వస్తుంది. అందువల్ల మీరు పెట్రోల్ వెహికల్‌ను ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌తో ఎక్స్చేంజ్ చేసుకుంటే చాలా వరకు డబ్బులు ఆదా చేసుకోవచ్చు.
4/ 8
మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ పొందాలని భావిస్తే.. ముందుగా ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పాత పెట్రోల్ వెహికల్‌ను టెస్ట్ చేస్తారు. లీటర్, వర్కింగ్ కండీషన్, ఎన్ని కిలోమీటర్లు నడిచింది.. ఇలా అన్ని వివరాలను చెక్ చేస్తారు.
5/ 8
మీ పాత వెహికల్ చెకింగ్ అయిపోయిన తర్వత ఒక రేటును నిర్ణయిస్తారు. మీ పాత వెహికల్‌కు ఎంత రేటు వచ్చిందో తెలుసుకున్న తర్వాత.. మీరు కొనుగోలు చేయాల్సిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు చెక్ చేసుకోవాలి. రెండు ధరలకు మధ్య ఎంత వ్యత్యాసం ఉందో దాన్ని మీరు చెల్లించాల్సి ఉంటుంది.
6/ 8
అలాగే మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. తక్కువ వడ్డీ రేటుకు ఓలా స్కూటర్ కొనేందుకు రుణం పొందొచ్చు. మీ పాత వెహికల్‌కు వచ్చిన మొత్తాన్ని డౌన్ పేమెంట్‌గా కట్టేసి లోన్ తీసుకొని కొత్త ఓలా స్కూటర్ ఇంటికి తీసుకెళ్లొచ్చు.
7/ 8
ప్రస్తుతం ఓలా ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రో, ఎస్1 అనే మూడు మోడళ్లను అందిస్తోంది. వీటి ధర రూ. 84,999 నుంచి ప్రారంభం అవుతోంది. నెలవారీ ఈఎంఐ రూ. 1999 నుంచి ప్రారంభం అవుతోంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే 181 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు.
8/ 8
ఇకపోతే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 116 కిలోమీటర్లు. ఇంకా ఐపీ 67 రేటింగ్ ఉంది. హైపర్ మోడ్, ఎకో మోడ్ అనే రెండు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. అంతేకాకుండా ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లలో మీరు ఉచితంగానే టెస్ట్ రైడ్ చేయొచ్చు. నచ్చిన తర్వాతనే స్కూటర్ కొనొచ్చు.