ఇప్పుడు బ్యాంక్ అకౌంట్‌ను ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం. అయితే మీరు బ్యాంక్ అకౌంట్‌ను ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలని భావిస్తే.. నెట్ బ్యాంకింగ్ ఉండాలి. అలాగే ఎక్కడికైతే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ బ్రాంచ్ కోడ్ అవసరం అవుతుంది. ఇంకా మీ ఫోన్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉండాలి.
ఇలా మీరు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లకుండానే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సాయంతో బ్యాంక్ అకౌంట్‌ను మరొక బ్రాంచ్‌కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఉద్యోగ బదిలీ లేదంటే వేరే ఊరికి వెళ్లి స్థిరపడటం వంటివి జరిగితే.. ఇలా సులభంగానే బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్పర్ చేసుకోవచ్చు. ఇకపోతే ఎస్బీఐ ఇటీవలన క్రెడిట్ కార్డు చార్జీలను సవరించిన విషయం తెలిసిందే. రెంట్ పేమెంట్లపై ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తోంది. అలాగే ఈఎంఐ లావాదేవీలపై ప్రాసెసింగ్ ఫీజును పెంచేసింది. దీంతో కస్టమర్లపై ప్రభావం పడింది.