Instant Loan | ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారా? అందుకే లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. సులభంగానే లోన్ తీసుకోవచ్చు. బ్యాంక్‌కు వెళ్లాల్సిన పని కూడా లేదు.
2/ 9
ఎన్బీఎఫ్సీలు, డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ వంటివి సులభంగానే రుణాలు అందిస్తున్నాయి. ఆన్లైన్లోనే లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇవేకాకుండా థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కూడా రుణాలు పొందొచ్చు. గూగుల్ పే ద్వారా కూడా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
3/ 9
ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. గూగుల్ పే ద్వారా లోన్ పొందొచ్చు. అయితే ఇక్కడ గూగుల్ పే నేరుగా రుణాలు ఇవ్వదు. ఫైనాన్స్ కంపెనీలు గూగుల్ పేతో భాగస్వామ్యం కుదుర్చుకుంటాయి. ఇలా భాగస్వామ్యంతో లోన్స్ అందిస్తుంది.
4/ 9
అంటే మీరు గూగుల్ పే యాప్‌లోకి వెళ్లి అక్కడ అందుబాటులో ఉన్న డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ గూగుల్ పేకు రుణాలకు ఎలాంటి సంబంధం ఉండదు. కేవలం మీడియేటర్ మాదిరి పని చేస్తుందని గుర్తించుకోవాలి.
5/ 9
లోన్ పొందాలని భావించే వారు ముందుగా గూగుల్ పే యాప్‌లోకి వెళ్లాలి. అక్కడ మేనేజ్ మనీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో క్రెడిట్ కార్డు, లోన్స్, గోల్డ్ అనే ఆప్షన్లు మీకు కనిపిస్తాయి. వీటిల్లో లోన్స్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
6/ 9
ఇప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు లోన్ ఆఫర్లుపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్న ఆప్షన్లు కనిపిస్తాయి. మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవాలి. డీఎంఐ ఫైనాన్స్ లోన్ ఆప్షన్ కనిపిస్తుంది.
7/ 9
స్టార్ట్ లోన్ అప్లికేషన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు అవసరమైన వివరాలు అందించాలి. అర్హత కలిగిన వారికి రుణం లభిస్తుంది. లేదంటే లేదు. పాన్ కార్డు వివరాలు, అడ్రస్, ఆధార్ వంటి తదితర సమచారం అందించాల్సి ఉంటుంది.
8/ 9
రుణాలపై వడ్డీ రేటు 15 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. కనీసం రూ. 10 వేల నుంచి లోన్ పొందాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ. 8 లక్షల వరకు లోన్ పొందొచ్చు. మీ రుణ అర్హత ప్రాతిపదికన మీ లోన్ అమౌంట్ నిర్ణయం అవుతుంది.
9/ 9
మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. ఆన్లైన్లోనే పని మొత్తం పూర్తవుతుంది. ఇన్‌స్టంట్‌గా లోన్ పొందొచ్చు. పేపర్ వర్క ఉండదు. ఇన్‌స్టా మనీ, మనీ వ్యూ, మనీ ట్యాప్, క్యాషే వంటివి కూడా గూగుల్ పే ద్వారా రుణాలు ఆఫర్ చేస్తున్నాయి.