అయితే ఇప్పుడు వడ్డీ రేటు 35 బేసిస్ పాయింట్లు పెరగడం వల్ల ప్రతి నెలా రూ. 17 మేర అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఇక కార్ లోన్ విషయానికి వస్తే.. మీరు రూ. లక్ష మొత్తాన్ని రుణంగా తీసుకొని ఉ:టే.. ఐదేళ్ల టెన్యూర్‌కు 8.4 శాతం వడ్డీ రేటు పరంగా అయితే నెలవారీ ఈఎంఐ రూ. 2047 అవుతుంది. రేటు పెంపు తర్వాత చూస్తే.. నెలకు రూ. 2064 కట్టాల్సి వస్తుంది.
అలాగే ఉదాహరణకు 8.5 శాతం వడ్డీ రేటు ప్రకారం రూ. 10 లక్షల మొత్తాన్ని పదేళ్ల టెన్యూర్‌తో రుణంగా తీసుకొని ఉంటే.. ఇప్పుడు వడ్డీ రేటు 0.35 శాతం పెరిగితే నెలవారీ ఈఎంఐ రూ. 300 పైకి చేరుతుంది. అంటే రెపో రేటు పెంపు వల్ల ఈఎంఐ మొత్తం ఏ విధంగా పైపైకి చేరుతుందో అర్థం చేసుకోవచ్చు. బ్యాంకులు ఈఎంఐ పెంచొచ్చు. లేదంటే టెన్యూర్‌ను పొడిగించొచ్చు.